తెలంగాణ

గొగోయ్ రాజ్యసభ నామినేషన్ అనైతికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యుడిగా నియమితులు కావడం అనైతికమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు. పదవీవిరమణ చేసి ఎంతో కాలం గడవక ముందే ఆయనను రాజకీయ పదవికి నామినేట్ చేయడం చూస్తుంటే బీజేపీతో ఆయనకు ఉన్న సంబంధాలపై అనుమానాలు వస్తాయని, వాస్తవికంగా ఆపార్టీతో సంబంధాలు ఉన్నా లేకున్నా ప్రజల్లో అపోహలు వస్తాయని పేర్కొన్నారు. రంజన్ గొగోయ్ నియామకంతో భారత న్యాయవ్యవస్థ స్వతంత్రతపై అనేక అనుమానాలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఇప్పటికైనా రాష్టప్రతి గొగోయ్ నియామకాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన సూచించారు. కార్యనిర్వాహక వ్యవస్థకూ, న్యాయవ్యవస్థకూ ఉన్న అధికారాల విభజన అంశం చాలా కీలకమని, రాజకీయ నాయకులకు సంబంధాలున్న అనేక కేసులపై గొగోయ్ తీర్పులు ఇచ్చారని, ముఖ్యంగా రాఫెల్ కేసులో ఆయన తీర్పు అధికార పార్టీకి స్వాంతన చేకూర్చిందని, అలాగే సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ కేసు, అయోధ్య తీర్పు వంటి ఎన్నో అంశాల్లో గొగోయ్ తీర్పులు చాలా కీలకమైనవని అలాంటి తీర్పులు ఇచ్చిన వ్యక్తిని రాజ్యసభకు నామినేట్ చేయడం అంటే ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తుతాయని పేర్కొన్నారు. 2014లో సైతం మోదీ ప్రభుత్వం జస్టిస్ సదాశివంను కేరళ గవర్నర్‌గా నియమించి వివాదాలకు తెరతీశారని చెప్పారు.

*చిత్రం... సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ