తెలంగాణ
దేశ చరిత్రలోనే అపూర్వం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మార్చి 22: ప్రపంచానికే జనతా కర్ఫ్యూ స్పూర్తి దాయాకమని, దేశ చరిత్రలలోనే ఆపూర్వమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. కరోనా నివారణలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతొ జనతా కర్ఫ్యూ ఆదివారం విజయవంతంగా కోనసాగిందని తెలిపారు. ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొని తమ పూర్తి మద్దతు తెలిపారన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల మద్దతు ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఇలాంటి కర్ఫ్యూ చూస్తున్నామని తెలిపారు. ఎమర్జెన్సీ, మెడికల్ వాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, కరోనాకు వ్యతిరేకంగా దేశంలో యుద్దం జరుగుతోందని, 24 గంటల జనతా కర్ఫ్యూ ప్రజల రక్షణ కోసమేనని తెలిపారు. దేశ రక్షణ కోసం 99 శాతం ప్రజలు ఇంట్లోనే ఉన్నారని, ఇది ప్రంపంచానికే గొప్ప స్పూర్తి అని కొనియాడారు. ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలలో ఇలాంటి ప్రయోగాలు విఫలమయ్యాయని, కానీ దేశంలో అత్యవసర విభాగాలు తప్ప అన్ని బంద్ అయ్యాయని అన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పాలు, హాస్పిటల్ లాంటి వాటికి తప్ప నగర ప్రజలు బయటిక రావొద్దని సీపీ కోరారు. కాగా కరోనా కట్టడికి ప్రజల సహకారం చాలా అవసరమన్నారు. కరోనావైరస్ కట్టడి కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చినా జనతా కర్ఫ్యూ పిలుపునకు దేశ ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ప్రజలంతా బయటకు వచ్చి చప్పట్లు కొడుతూ అహర్నిశలు పనిచేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, అత్యవసర సిబ్బందికి సంఘీభావం తెలిపారు. ఇళ్ల లోగిళ్లలో నిలబడి చప్పట్లతో ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ వద్ద ఆదివారం సాయంత్రం ఎర్పాటు చేసిన కార్యక్రంలో సీపీ అంజనీ కుమార్‌తో పాటు నగర అదనపు సీపీలు ఇతర పోలీసు అధికారులు జనతా కర్ఫ్యూ సందర్భంగా చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు.