తెలంగాణ
ఎమర్జెన్సీ సేవలకు సిద్ధంగా ఉన్నాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మార్చి 21; ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలకు జనతా కర్ఫ్యూ పాటించాలని ఇచ్చిన పిలుపును అమలు చేస్తామని తెలంగాణ హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు డాక్టర్ అశోక్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ మోహన్ గుప్తా తెలిపారు. వైద్య వృత్తిలో ఉన్న వారి పట్ల మోదీకి ఉన్న చిత్తశుద్ధి, గౌరవం తెలియచేస్తుందన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలకు లోబడి తాము ఎమర్జన్సీ సేవలకు హాజరవుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్రప్రభుత్వానికి తాము సహకరిస్తామన్నారు. ప్రజలు కూడా కరోనా వైరస్‌తో బాధపడుతున్నట్లు సమాచారం ఉంటే తమకు తెలియచేయాలన్నారు. రొటీన్ విజిట్స్, చెకప్‌లను వాయిదా వేసుకోవాలని వారు రోగులనుకోరారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక రోగికి ఒక అటెండెంట్‌ను మాత్రమే అనుమతిస్తామన్నారు. కరోనాపై అవాస్తవాలను, వదంతలను నమ్మరాదని వారు కోరారు.
పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత నిర్వహణ
మార్గదర్శకాలను దంతవైద్యులు పాటించాలి
* ఇండియన్ డెంటల్ అసోసియేషన్
హైదరాబాద్, మార్చి 21: కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన ఆరోగ్య పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత నిర్వహణ మార్గదర్శకాలను దంతవైద్యులు పాటించాలని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐడీఏ డెక్కన్ బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ జగదీశ్వరరావు,కార్యదర్శి డాక్టర్ ఏ శ్రీకాంత్ ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్‌పై సమగ్ర అవగాహనను ప్రజల్లో పెంచాలన్నారు. వివిధ మీడియాల్లో వచ్చే ఆధార రహిత అంశాలను విస్మరించాలన్నారు. ఇవి విశ్వాసాన్ని పెంచడం మాని ఆందోళనలను సృష్టిస్తాయన్నారు. సోషల్ మీడియా వచ్చే తప్పుడు బాధ్యతారాహిత్యమైన, నిరాధారమైన పోస్టులకు వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆరోగ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు, మద్దతును ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నారు.
ఉపాధ్యాయులంతా పాల్గొనాలి : సంఘాల పిలుపు
హైదరాబాద్, మార్చి 21: భారత ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ జనతా కర్ఫ్యూ అమలు చేయడం ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తద్వారా కరోనా వ్యాధి చెయిన్‌కు అడ్డుకట్ట వేయగలుగుతామని టీపీయూఎస్ అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధానకార్యదర్శి నవాత్ సురేష్ పేర్కొన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా దేశ పౌరులు అందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని దేశ ప్రధాని మోదీ కోరిన సందర్భంగా ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.
తెలంగాణ ప్రాంతంలో ఉపాధ్యాయులు అంతా స్వచ్ఛందంగా దీనిని పాటించాలని వారు పేర్కొన్నారు. ఇది జనం కోసమేనని జనం ద్వారా జనమే చేసుకునే కర్ఫ్యూ అని నరేంద్రమోదీ అభివర్ణించారని చెప్పారు. రానున్న సవాళ్లను ఎదుర్కొనడంతో ఈ కర్ఫ్యూ సాధనంగా ఉపయోగపడుతుందని అన్నారు. కర్ఫ్యూ విషయంలో రాష్ట్రాలు సహకరించాలని దేశ ప్రధాని కోరారని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తమ వంతు కర్తవ్యంగా వ్యాధి గురించి అందరికీ తెలియజేస్తూ ప్రచారం చేస్తూ వ్యాధి సోకే అవకాశాలు గురించి చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. జాతి కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న వారికి ఉపాధ్యాయ సంఘం తరఫున అభినందనలు తెలిజేయడం అందరి కర్తవ్యమని పేర్కొన్నారు.
వైన్‌షాప్‌ల మూసివేత
* వైన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు
హైదరాబాద్, మార్చి 21: జనతా కర్ఫ్యూలో భాగంగా తెలంగాణలో ఆదివారం మద్యం షాపులు కూడా మూతపడనున్నాయి. దేశ ప్రజలంతా ఆదివారం జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని ప్రదానమంత్రి నరేంద్రమోదీ పిలపునివ్వడం, అవసరమైతే తెలంగాణను షట్‌డౌన్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం అన్ని వైన్ షాపులు బంద్ పాటించనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలను మూసి వేస్తున్నట్లు తెలంగాణ వైన్స్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డీ.వెంకటేవ్వరరావు ప్రకటించారు. మొత్తం 2,400 వైన్ షాపులు బంద్ పాటిస్తాయని చెప్పారు. ప్రభుత్వ ఆదేవాల మేరకు ఇప్పటికే 700 బార్లు మూసేశారని తెలిపారు. కరోనానను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలన్న ప్రధాని నైరేంద్రమోదీ ఆదివారం ఎవ్వరః ఇళ్లలో నుంచి బయటకు రాకుండా స్వీయ నిర్భంధం పాటించాలని కొరిన సంగతి విదితమే.