S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/05/2019 - 05:13

హైదరాబాద్, డిసెంబర్ 4: సరళీకరణ విధానాలపై పోరాడకుండా మతోన్మాదానికి అడ్డుకట్టవేయలేమని సీపీఐఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఈ రెండింటికీ లింకుందని ఆయన పేర్కొన్నారు.

12/05/2019 - 05:10

హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణలో నమోదు అవుతున్న గ్రీన్ ఛాలెంజ్‌కి మద్దతుగా అజారుద్దీన్ స్పందించారు. తెరాస ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌కు మద్దతుగా హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో హరిత యజ్ఞాన్ని చేపట్టారు. బుధవారం హైదరాబాద్ క్రికెట్ అధ్యక్షుడు ఆజారుద్దీన్ మొక్కలు నాటారు.

12/05/2019 - 04:51

హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‌పాం పంటను సాగు చేసే రైతులను ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. ఆయిల్ పామ్ గెలల ధరలను నిర్ణయించే అంశంపై బుధవారం ఇక్కడ సమావేశం జరిగింది. ఒక ఎకరా వరిసాగుకు అవసరమైన నీటితో మూడు ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ను సాగు చేయవచ్చని తెలిపారు.

12/05/2019 - 04:50

హైదరాబాద్, డిసెంబర్ 4: ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్ర రెవెన్యూ రాబడులపై పడింది. ఆర్థిక మాంద్యం హెచ్చుగా ఉందని, దీని వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గుతుందని ఇటీవల పదే పదే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విషయం విదితమే. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అన్ని రాబడులపై ఆదాయం రూ.830 కోట్ల మేర తగ్గింది. రాష్ట్రం మొత్తం రెవెన్యూ రూ.44,615 కోట్లు రావాల్సి ఉండగా, రూ.43,777 కోట్లు వచ్చింది.

12/05/2019 - 04:49

హైదరాబాద్, డిసెంబర్ 4: దిశ కేసులో రాష్టమ్రంత్రులు, టీఆర్‌ఎస్ పార్టీలో కీలక పాత్రవహించే కేటీఆర్, హరీష్‌రావులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించకపోవడాన్ని టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు 30 మంది మరణించినా ఈ మంత్రులు జాలి చూపలేదన్నారు. కేవలం వత్తిడి మధ్యనే ఆర్టీసీ సమ్మె కార్మికులను పిలిచి మాట్లాడారన్నారు.

12/05/2019 - 04:48

హైదరాబాద్, డిసెంబర్ 4: ఆర్ధిక రంగాన్ని పరిపుష్టం చేయడలో కీలక భూమికను పోషిస్తున్న లాజిస్టిక్స్ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని లాజిస్టిక్స్ స్కిల్స్ కౌన్సిల్ చైర్మన్ కెప్టెన్ రామానుజన్ చెప్పారు.

12/05/2019 - 04:47

హైదరాబాద్, డిసెంబర్ 4: విద్యార్ధుల్లో ఇక నైపుణ్యాన్ని పెంపొందించే విద్యను అందించనున్నట్టు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు.

12/05/2019 - 04:46

హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం జీఓ జారీ అయింది. రాష్ట్రంలో ప్రస్తుతం 909 ప్యాక్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఇటీవల కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ఇందుకు అనుగుణంగా గ్రామాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 573 మండలాలు ఉన్నాయి.

12/05/2019 - 04:46

హైదరాబాద్, డిసెంబర్ 4: ఇంజనీరింగ్ సహా ఇతర వృత్తి విద్యా కోర్సుల అనుమతులు, ఇతర పర్యవేక్షణ వ్యవహాలను చూసేందుకు ఎఐసీటీఈ హైదరాబాద్‌లో సౌత్‌సెంట్రల్ రీజనల్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పొదిలి అప్పారావు వ్యవహరిస్తారు.

12/05/2019 - 02:13

హైదరాబాద్: హిందూ ధర్మానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెనుముప్పుగా తయారయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు. హిందువుల సంస్కృతి, సంప్రదాయాలను మంటకలుపుతున్నారని ఆరోపించారు. యాదాద్రి మూల విరాట్‌కే భంగం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pages