తెలంగాణ

లక్ష కుటుంబాలకు ఉప్పల చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలకొండపల్లి, ఏప్రిల్ 13: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలకు తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ చేయూత ఇస్తున్నారు.ఆమనగల్లు డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల పేదలకు సుమారు 25 లక్షల రూపాయాలు ఖర్చుపెట్టి ఇంటికో శానిటైజర్ పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్, ఆమనగల్లు మండల కేంద్రాలలో ప్రతి కుటుంబానికి శానిటైజర్ అందించారు. తలకొండపల్లి మండల కేంద్రంలో మాత్రం 32 గ్రామ పంచాయతీలతో పాటు మారుమూల ప్రాంతాలైన పల్లెలు గిరిజన తండాలతో కలుపుకొని సుమారు 100కుపైగా పిచికారి మందులు చేయించారు. సోమవారం తలకొండపల్లి మండలంలోని వెంకట్రావుపేటలో ఉప్పల చారిటబుల్ సౌజన్యంతో మాజీ ఎంపీపీ లక్ష్మీదేవి రఘురాములు ఆధ్వర్యంలో ఇంటింటికీ శానిటైజర్లు, గ్రామస్థుల సహకారంతో కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లక్ష్మీదేవి రఘురాములు, మాజీ ఉప సర్పంచ్ కంఠం సురేందర్, నాయకులు శంకరయ్య, షభానా బేగం, వెంకటయ్య, బాలేశ్వర్, శ్రీనివాసులు, శ్రీశైలం, జగదీశ్వర్, జహంగీర్, తిరుపతి రెడ్డి, సాయి కిరణ్, వేణు గోపాల్, రవి పాల్గొన్నారు.
కూరగాయల పంపిణీ
పేదలు ఇంట్లో నుంచి బయటికి రాలేక పస్తులుండే పరిస్థితులు నెలకొనడంతో మెదక్‌పల్లి గ్రామంలోని కసిరెడ్డి యాదగిరి రెడ్డి, నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని తలకొండపల్లి నిర్మల శ్రీశైలం గౌడ్ అన్నారు.
*చిత్రం...కూరగాయలు పంపిణీ చేస్తున్న మాజీ ఎంపీపీ లక్ష్మీదేవి