S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/16/2019 - 05:43

గద్వాల, ఆగస్టు 15: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి ఉద్ధృతి గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. గురువారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 316.72 మీటర్లు, 6.279 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకోగా ఎగువ ప్రాంతం నుంచి 7.05 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

08/16/2019 - 05:42

హైదరాబాద్, ఆగస్టు 15: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం త్వరలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి వెల్లడించారు. క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుందని గురువారం ఇక్కడ తెలిపారు.

08/16/2019 - 05:41

వరంగల్, ఆగస్టు 15: వరంగల్ నగరంలో భూ దందాలకు తక్షణమే చెక్‌పెట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గురువారం సాయంత్రం వరంగల్ సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ఎట్ హోంలో అధికారులతో మంత్రి మాట్లాడారు.

08/16/2019 - 05:41

నాంపల్లి, ఆగస్టు 15: ప్రజల అభీష్టం మేరకే పార్టీని వీడాల్సి వస్తుందని, బీజేపీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

08/16/2019 - 05:33

హైదరాబాద్, ఆగస్టు 15: కాశ్మీర్ విషయంలో బీజేపీ చరిత్రను వక్రీకరించి అవాస్తవాలను ప్రచారం చేస్తోందని, మతతత్వశక్తులపై రాజీలేకుండా పోరాడుతామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఇక్కడ ఆయన గాంధీ భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

08/16/2019 - 05:31

హైదరాబాద్, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ భవన్‌లో జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కార్యాలయానికి తరలివచ్చి ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు.

08/16/2019 - 05:29

హైదరాబాద్, ఆగస్టు 15: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ‘పవర్‌వీక్’ కార్యక్రమాన్ని తీసుకువస్తున్నామని ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘమారెడ్డి అన్నారు. గురువారం ఎస్‌పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.

08/16/2019 - 05:27

హైదరాబాద్, ఆగస్టు 15: సత్వర న్యాయం అందించడం ద్వారానే అసలైన స్వాతంత్య్రం అందినట్టు అవుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ జాతీయ జండాను ఎగురవేశారు.

08/16/2019 - 05:26

హైదరాబాద్, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్‌పీ మాజీ నేత కె జానారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు.

08/16/2019 - 05:23

హైదరాబాద్, ఆగస్టు 15: దేశాభివృద్ధిలో ప్రజా రవాణా వ్యవస్థ చాలా కీలకమైనదని, ప్రతి రోజూ దాదాపు కోటి మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్న ‘ఆర్టీసీ’ సంస్థలో భాగస్వాములమైనందుకు గర్వపడాలని సంస్థ ఎండీ సునీల్‌శర్మ కొనియాడారు. గురువారం హైదరాబాద్ బస్సు భవనంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Pages