S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/17/2020 - 06:35

*చిత్రం... అసెంబ్లీలో సోమవారం ముఖ్యమంత్రి చాంబర్ వద్ద హోం మంత్రి మహమూద్ ఆలీ నేతృత్వంలో సీఎం కేసీఆర్‌ను కలిసిన మైనారిటీ నేతలు

03/17/2020 - 06:33

హైదరాబాద్, మార్చి 16: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్) ప్రబలుతున్న నేపథ్యంలు ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉల్లంఘించి స్కూళ్లు నడుపుతున్న యాజమాన్యాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు.

03/17/2020 - 06:32

హైదరాబాద్, మార్చి 16: తెలంగాణలో సాగునీటి యాజమాన్య పరిశోధనా కేంద్రం, ఆవాల పరిశోధనా కేంద్రాలను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సోమవారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు లేఖ రాశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడంతో పెద్ద ఎత్తున సాగునీరు అందుబాటులోకి వచ్చిందన్నారు.

03/17/2020 - 06:31

హైదరాబాద్, మార్చి 16: కరోనా ఉధృతంగా ఉండటం వల్ల రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో పరిశుభ్రత పాటించాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ మార్కెట్లలో రైతులు, మార్కెట్ సిబ్బంది, వ్యాపారులు, కూలీలు తదితరులతో రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ కారణంగా ఎవరికీ కరోనా సోకకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

03/17/2020 - 01:32

హైదరాబాద్, మార్చి 16: కరోనాను అరికట్టడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం 24న7 అప్రమత్తంగా ఉంది. కరోనా నివారణకు ముందస్తు చర్యల కోసం ఐఏఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

03/17/2020 - 01:25

హైదరాబాద్, మార్చి 16: భారతదేశంలోని అనేక మంది ప్రజల్లో భయాందోళనలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ శాసనసభ, ఏదేనీ మతం లేదా ఏవేనీ విదేశాలకు సంబంధించిన నిర్దేశాలన్నింటినీ తొలగించడానికి వీలుగా 2019 పౌరసత్వ సవరణ చట్టాన్ని మరోమారు సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ శాసనసభ సోమవారం నాడు ఏకగ్రీవ తీర్మానం చేసింది.

03/17/2020 - 01:20

హైదరాబాద్: సంక్షే మం, అభివృద్ధి రంగాలను ప్రజ ల వద్దకు చేర్చడానికి పన్నులు పెంచక తప్పదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోసారి స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2020-2021 ఆర్థిక బడ్జెట్ తెలంగాణ సమాజానికి దిశ, దశ నిర్ధేశించే విధంగా ఉందన్నా రు.

03/17/2020 - 01:19

హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం లో సవరణలు కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు శాసనసభలో సోమవారం ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానంపై సభ్యులు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. చర్చలో చివరగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతుండగా ఒక దశలో స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లారు.

03/16/2020 - 16:57

హైదరాబాద్: మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. డీసీఎం వ్యాన్, ఆర్టీసీ బస్సు ఢీకొని ఐదుగురు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాది గ్రామానికి చెందినవారు డీసీఎం వ్యానులో ఏడుపాయలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

03/16/2020 - 13:42

హైదరాబాద్: ఈ దేశానికి సీఏఏ అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన ఈరోజు శాసనసభలో సీఏఏకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడుతూ దేశంలో ఇప్పటికే ఏడు రాష్ట్రాలు.. కేరళ, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయని, తమది ఎనిమిదో రాష్ట్రమని సీఎం తెలిపారు.

Pages