S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/16/2019 - 05:21

హైదరాబాద్, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం రోజున మాజీ సైనికుని కూతురి ఉన్నత విద్యకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సైనికుని కుటుంబానికి సాయం అందించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని కేటీఆర్ పేర్కొన్నారు.

08/16/2019 - 05:17

హైదరాబాద్, ఆగస్టు 15: రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించడంలో దక్షిణ మధ్య రైల్వే తీసుకుంటున్న చర్యలు సంతృప్తిని ఇస్తున్నాయని ఎస్‌సీఆర్ జీఎం గజానన్ అన్నారు. గురువారం 73వ స్వాతంత్య్ర దినోత్సవాలు సికింద్రాబాద్ రైల్వే స్టోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

08/16/2019 - 05:15

హైదరాబాద్, ఆగస్టు 15: అత్యుత్తమ ప్రమాణాలను సాధించడం ద్వారా జాతీయస్థాయిలో ఉత్తమ వర్శిటీగా ఎదిగేందుకు కృషి చేస్తున్నట్టు ఇంగ్లీషు ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఇ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

08/16/2019 - 05:05

హైదరాబాద్, ఆగస్టు 15: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. లకిడికాపూల్‌లోని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) కార్యాలయంలో వేడుకలు జరిగాయి. అదనపు డీజీపీ (పర్సనల్) శివధర్ రెడ్డి జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐడీ, మహిళ రక్షణ విభాగం ఎస్‌పీ సుమతి తదితరులు పాల్గొన్నారు.

08/16/2019 - 05:01

హైదరాబాద్, ఆగస్టు 15: తెలంగాణ ప్రభుత్వం గురువారం గోల్కొండ కోట వద్ద ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ప్రదర్శించిన కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జాతీయ పతాకం కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. అదే వేదిక నుండి కేసీఆర్ ప్రసంగించారు. రాణిమహల్ ఎదుట ఉన్న కోట గదులపై కళాకారులు నిలబడి ప్రదర్శనలను ఇచ్చారు. కళాకారులు నిలబడేందుకు కిందిభాగంలో స్థలం లేకపోవడంతో కోటపైకి ఎక్కించారు.

08/15/2019 - 17:33

హైదరాబాద్:ప్రముఖ సినీ గేయ రచయిత శివ గణేశ్ కన్నుమూశారు. బుధవారం వనస్థలిపురంలోని తన నివాసంలో గుండెపోటుతో చనిపోయారు. శివ గణేశ్ వెయ్యికిపైగా సినిమాలకు పాటలు రాశారు. ‘ప్రేమికులరోజు’, ‘నర్సింహ’, ‘జీన్స్‌’, ‘బాయ్స్‌’ తదితర చిత్రాల కోసం పనిచేశారు. శివగణేశ్‌కు భార్య నాగేంద్రమణి, కుమారులు సుహాస్‌, మానస్‌ ఉన్నారు.

08/15/2019 - 13:13

హైదరాబాద్: అన్ని వర్గాల సంక్షేమం కోసం కార్యక్రమాలు చేపడుతున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. గోల్కొండకు చేరుకున్న ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రసంగించారు.

08/15/2019 - 07:00

హైదరాబాద్, ఆగస్టు 14: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలను ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ కృష్ణార్జునులుగా పోల్చడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. వారిద్దరు కృష్ణార్జునులు అయితే మరి కౌరవులు ఎవరు? పాండవులు ఎవరో ఆ విషయం కూడా చెబితే బాగుండేదని ఒవైసీ ఎద్దేవా చేశారు.

08/15/2019 - 06:59

హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణ రాష్ట్ర సమితికి కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ బీజేపీకి లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గాలి వీచిందని, ఆ గాలిలోనే రాజకీయాలకు పనికిరాని కొందరు గెలిచారని ఏద్దేవా చేశారు. బుధవారం నాడిక్కడ మంత్రి తలసాని మీడియాతో చిట్ చాట్ చేశారు.

08/15/2019 - 06:58

హైదరాబాద్, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సైనికుల సంక్షేమ నిధికి ఇడిల్‌వీస్ టోకియో లైఫ్ ఇనూరెన్స్ ఏజెంట్లు తమ దాతృతత్వాన్ని చాటుకున్నారు. తమ ఇనూరెన్స్‌కు చెందిన ప్రతి ఏజెంట్ రూ. 250 చొప్పున విరాళాన్ని అందించబోతున్నట్టు ఇడిల్‌వీస్ టోకియో లైఫ్ ఇన్స్‌రెన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అభిషేక్ గుప్త హైదరాబాద్‌లో బుధవారం ప్రకటించారు.

Pages