తెలంగాణ

ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ తెలంగాణ బీజేపీ ప్రతినిధి బృందం బుధవారం నాడు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మూడు పేజీల వినతిపత్రాన్ని గవర్నర్‌కు సమర్పించింది. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు, మాజీ ఎంపీ జీ వివేక్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ మంత్రి ఎం నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రామచంద్రారెడ్డి తదితరులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ప్రత్యేక శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇటీవల అసెంబ్లీలో సీఏఏకు
వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోమని కేసీఆర్‌ను ఆదేశించాలని వారు కోరారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి మొదలయ్యే ఎన్‌పీఆర్‌కు సహకరించాలని కూడా సూచించాలని గవర్నర్‌ను బీజేపీ బృందం కోరింది. కేసీఆర్ మంత్రివర్గ సభ్యులు వాస్తవాలను చెబుతున్నారని, వాటిని నియంత్రించాలని, ద్వేషంతో చేస్తున్న పలు వ్యాఖ్యలను నిలువరించాలని అన్నారు. తప్పుదారి పట్టించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బేషరతుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని వారు గవర్నర్‌ను కోరారు. తాత్కాలిక ప్రయోజనాలకు భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని వారు గవర్నర్ దృష్టికి తెచ్చారు. ఈనెల 16న అసెంబ్లీలో చేసిన తీర్మానం ద్వారా సీఏఏ, ఎన్‌పీఆర్‌లపై లేనిపోని అనుమానాలను, అవాస్తవాలను మాట్లాడిందని, ఇదో అవకాశంగా వాడుకుని ముఖ్యమంత్రి సైతం దురభిప్రాయాన్ని కలిగించారని అన్నారు. పౌరసత్వ అంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అంశమని, ఈ అంశానికీ, అసెంబ్లీకి సంబంధం లేదని అన్నారు.
అఖండ భారతాన్ని నిర్మిస్తారా?: లక్ష్మణ్
ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలని కేసీఆర్ అంటున్నారని, వాస్తవానికి ఈ దేశంలో ఉన్న ముస్లింలందరికీ పౌరసత్వం ఉందని, అసలు ఏ ముస్లింలకు పౌరసత్వం ఇవ్వమంటున్నారో కేసీఆర్ స్పష్టం చేయాలని డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన తర్వాత ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పాకిస్తాన్‌లో ఉన్న ముస్లింలు అందరికీ పౌరసత్వం ఇవ్వమంటున్నారా? అని నిలదీశారు. అలా అయినా ఫర్వాలేదని, అందరికీ పౌరసత్వం ఇచ్చి అఖండ భారతాన్ని నిర్మిస్తే మంచిదేనని వ్యాఖ్యానించారు.

*చిత్రం... గవర్నర్ తమిళిసైని బుధవారం కలిసి విజ్ఞాపన పత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు లక్ష్మణ్, రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి, వివేక్, డీకే అరుణ