తెలంగాణ

ఆ రైతులకు ఒకే విడత రుణ మాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: రాష్ట్ర ప్రభుత్వం 50వేల లోపు రుణం పొందిన రైతులకు ఒకే విడతలో రుణ మాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు పెసరగాయల జంగారెడ్డి, ప్రధానకార్యదర్శి తీగల సాగర్ కోరారు. అల్ ఇండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి సైతం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒక లేఖ రాశారు. 50వేల లోపు రుణం పొందిన రైతులు 13.97 లక్షల మంది ఉన్నారని వీరికి 4301 కోట్లు సరిపోతాయని చెప్పారు. వీరు రుణ విముక్తులు కావడం వల్ల తిరిగి బ్యాంకుల నుండి అప్పు పొంది ఉపసమనం పొందుతారని అన్నారు. 50 వేలకు పైగా రుణం ఉన్న రైతులకు మూడు విడతలుగా మాఫీ చేయాలని, గతంలో నాలుగు విడతలు చేయడం వల్ల రైతులపై 9812 కోట్లు వడ్డీ భారం పడిందని, ఇందులో ఉన్న పేద రైతులు బ్యాంకులో బాకీ ఉండటం వల్ల తిరిగి రుణం పొందలేక పోయారని అన్నారు. ఎల్‌ఈసీ కార్డు ఉన్న వారికి రీ షెడ్యూలు చేసిన వారికి రుణ మాఫీ వర్తించదని జీవో చెప్పారు. వాస్తవానికి వీరంతా పేదరైతులే. ఎల్‌ఈసీ కార్డుల ద్వారా వ్యవసాయ రుణం పొందిన వారికి ప్రకృతి వైపరీత్యాల వల్ల రీ షెడ్యూలు చేసుకున్న వారికి రుణ మాఫీ వర్తింపచేయాలని కోరారు.