తెలంగాణ

పర్యావరణం, అటవీ శాఖకు రూ.791.47 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణం, అడవులు, శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన శాఖల అభివృద్ధికి 2020-21 వార్షిక బడ్జెట్‌లో రూ.791.47 కోట్ల నిధులను కేటాయించింది. రాష్ట్రంలో ప్రకటిత అటవీ ప్రాంతం 27402.98 చదరపు కి.మీ ఉంది. రాష్ట్ర భౌగోళిక ప్రాంతంలో అటవీ ప్రాంతం 24 శాతంగా ఉంది. అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలని రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించింది. రాష్ట్రంలో 12 రక్షిత ప్రాంతాలు, 3 జాతీయ పార్కులు, 3 టైగర్ రిజర్వులు, 7 అభయారణ్యాలు కలిపి 7260 చదరపుకి.మీ విస్తరించి ఉన్నాయి. రిజర్వు అటవీ ప్రాంతాల వెలుపల అనువైన ప్రాంతాల్లో చెట్ల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని, దీని ద్వారా అటవీ సంపద, పచ్చదనం కింద 33 శాతానికి అడవులను పెంచాలని ప్రతిపాదించారు. అడవులను పెంచేందుకు తెలంగాణ హరిత హారం అనే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి, తెలంగాణ రాష్ట్ర సాంకేతిక మండలి, తెలంగాణ రాష్ట్ర జాతీయ హరిత దళాల డైరెక్టరేట్‌లు అడవుల పెంపకానికి బృహత్తర ప్రణాళికను అమలు చేస్తున్నాయి. జాతీయ హరిత దళాల డైరెక్టరేట్ పర్యావరణ క్లబ్‌లను నెలకొల్పింది. ఐదు వేల పాఠశాలల్లో పర్యావరణ కార్యకలాపాల్లో జాతీయ హరిత దళాలు భాగస్వామ్యమవుతున్నాయి. జీవ వైవిధ్య మండలిని 2002 చట్టం మేరకు ఏర్పటు చేశారు. గ్రామ పంచాయతీల స్థాయిలో 12746 మీఎంసీలు, మండల స్థాయిలో 537, జిల్లా స్థాయిలో 32, మున్సిపల్ స్థాయిలో ఆరు బీఎంసీలను పూర్తి చేశారు.
రాష్ట్రంలో రెండు టైగర్ రిజర్వు కేంద్రాలు ఆమ్రాబాద్, కవ్వాల్ ప్రాజెక్టులు ఉన్నాయి. కవ్వాల్ టైగర్ ప్రాజెక్టులో మైసంపేట, రాంపూర్, గ్రామాలకు చెందిన 142 కుటుంబాలను మరొకచోటికి మార్చడానికి ఈ పథకం కింద కేంద్రం నిధులను కేటాయించంది. కుటుంబానికి రూ.10లక్షల నష్టపరిహారం ఇవ్వనున్నారు. అడవుల అభివృద్ధికి సిద్ధిపేట జిల్లా ములుగు వద్ద కొత్త క్యాంపస్‌ను ప్రారంభించారు. 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టకున్నారు. అటవీయేతర ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీసీ ప్రాంతాలతో పాటు 130 కోట్ల మొక్కలను నాటడం, ప్రకటిత అటవీ ప్రాంతాల లోపల 100 కోట్ల మొక్కలు, చిన్న మొక్కలను నాటడం, పునరుజ్జీవింపచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అటవీబ్లాక్‌ల అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో 31 పార్కులను పట్టణ అటవీ పార్కులుగా అభివృద్ధి చేశారు.