తెలంగాణ

కరోనా కట్టడికి మరింత కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండా లాక్‌డౌన్ ఆంక్షలను అధికార యంత్రాంగం కట్టుదిట్టం చేస్తునే వైరస్ బాధిత ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్‌లు గుర్తించి ఆంక్షలు కఠినతరం చేస్తు వైరస్ విస్తరించకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటిదాకా 12 కంటైన్ మెంట్ ప్రాంతాలు గుర్తించగా పోలీసులు ఈ ప్రాంతాల్లోకి రాకపోకలను నిషేదించగా, అక్కడి ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు, మందులను, మాస్క్‌లను అధికార యంత్రాంగం ద్వారానే అందిస్తున్నారు.
మొబైల్ ఏటీఎంల ద్వారా నగదు వసతి కల్పిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, కూరగాయలు, నిత్యవసర సరుకులు, రేషన్ సరుకుల పంపిణీ వంటి కేంద్రాల్లో సామాజిక దూరం పాటించేలా విస్తృత ప్రచారం సాగిస్తు అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లపై చెక్‌పోస్టులతో జన సంచారం లేకుండా పోలీస్ శాఖ పర్యవేక్షణ సాగిస్తుండగా, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖల సిబ్బంది కరోనా నియంత్రణలో తమ బాధ్యతల్లో మునిగిపోయారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కేసుల ఊసు లేనప్పటికి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కరోనా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య సోమవారం నాటికి 37కు చేరింది. సూర్యాపేట జిల్లాలో కొత్తగా సోమవారం మఠంపల్లి మండలం నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడికి కరోనా సోకినట్లుగా గుర్తించడంతో ఈ జిల్లాలో ఇప్పటిదాకా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. శ్వాస సంబంధిత సమస్యలకు గురైన కార్మికుడిని కంపెనీ వైద్యులు గుంటూరుకు వైద్య పరీక్షల నిమిత్తం పంపించగా అతడికి కరోనా పాజిటివ్‌గా తేలగా అక్కడే ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నాడు. లాక్‌డౌన్ ఆంక్షల నడుమ సిమెంట్ ఫ్యాక్టరీని నడిపించడం వివాదస్పదమవ్వగా కరోనా పాజిటివ్ సోకిన కార్మికుడితో ఎంతమంది కలిసి పనిచేశారు, బాధితుడితో పాటు వారంతా ఎక్కడెక్కడ సంచరించారు.. ఎవరెవరని కలిశారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
సిమెంట్ కంపెనీ కార్మికుల కాలనీ వాసుల ఆరోగ్య స్థితిగతులపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించి కాలనీ ప్రాంతాన్ని, సమీప తండాను కంటైన్‌మెంట్ ప్రాంతంగా గుర్తించాలని నిర్ణయించి కరోనా కార్మికుడితో సన్నిహితంగా ఉన్నవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
లాక్‌డౌన్‌లో ఫ్యాక్టరీ నిర్వహణపై సిమెంట్ కంపెనీ యాజమాన్యం చెబుతున్నదాని మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సిమెంట్ అందించే విషయమై తమకు అనుమనుతులున్నందునే ఫ్యాక్టరీ నడిపించామంటుండగా, ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే 206 మంది అనుమానితుల నమూనాలు సేకరించగా, ఇప్పటివరకు అందిన పరీక్షల ఫలితాల మేరకు 21 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా, ప్రభుత్వ క్వారంటైన్‌లలో 577 మంది ఉన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడి కరోనా వ్యవహారం నేపధ్యంలో అనుమానితుల సంఖ్య, క్వారంటైన్ వ్యక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అటు నల్లగొండ జిల్లాలో 214 మందికి పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు 12 మందికి పాజిటివ్ రాగా వారికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరో ఏడుగురు అనుమానితులను క్వారంటైన్ సెంటర్‌లో చికిత్స అందిస్తుండగా, జిల్లాలో హోం క్వారంటైన్ 9,122 మంది ఉన్నట్లుగా జిల్లా వైద్యాధికారి కొండల్‌రావు వెల్లడించారు. సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జిల్లా కేంద్రంలోని కంటైన్‌మెంట్ ప్రాంతాలు మీర్‌బాగ్ కాలనీ, రహమాన్‌బాగ్ కాలనీ, బర్కత్‌పురలలో పర్యటించి ఆంక్షల అమలును, ప్రజలకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.
కరోనా పాజిటివ్ కేసులు నమోదైన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వైద్య బృందాలతో వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రతి రోజు వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించాలని సూచించడంతో పాటు బాధిత కుటుంబాల సభ్యులంతా విధిగా వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించాలంటు సూచించారు. వారికి ఏవైన సమస్యలుంటే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలని తెలిపారు. కలెక్టర్ వెంట్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కొండల్‌రావు, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి ఉన్నారు.
*చిత్రం... నల్లగొండ కంటైన్‌మెంట్ కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్