S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/10/2020 - 17:08

హైదరాబాద్: ఎన్‌ఆర్‌సీ (జాతీయ పౌర పట్టిక), సీఏఏ (పౌర సవరణ చట్టం)కు వ్యతిరేకంగా ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. మీరాలం ఈద్గాలో ప్రార్థనల అనంతరం ముస్లింలు పెద్ద ఎత్తున ప్రదర్శనలో పాల్గొన్నారు. దాదాపు 40 వేల మందితో ఈ ప్రదర్శన నిర్వహించినట్లు అంచనా. ఇదిలా ఉండగా ప్రదర్శన అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తదితరులు ప్రసంగించనున్నారు.

01/10/2020 - 13:11

హైదరాబాద్: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి యువజన పోరాట సమితి నిరాహార దీక్ష చేపట్టింది. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లోని మహేశ్‌ బాబు ఇంటి ఎదుట విద్యార్థులు దీక్షకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ ముగ్గుర్నీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ముగ్గురు ఆందోళనాకారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు.

01/10/2020 - 06:15

హైదరాబాద్, జనవరి 9: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, సమాజంలో ఎంతో ఎత్తుకు ఎదగాలన్నా, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నా ఇది ఎంతో అవసరమని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. స్వామి వివేకానంద 157వ జయంతి సందర్భంగా ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమం గురువారం సాయంత్రం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగింది.

01/10/2020 - 06:13

హైదరాబాద్, జనవరి 9: తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల బీమా యోజన (పీఎంబీవై), పునర్మిర్మాణ వాతావరణ ఆధారిత పంటల బీమా (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) పథకాల కింద విధి విధానాలను ఖరారు చేసినట్లు రాష్ట్ర స్థాయి పంటల బీమా సమన్వయ కమిటీ ప్రకటించింది. ఈ కమిటీ సమావేశం గురువారం ఇక్కడ జరిగింది. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా అధ్యక్షత వహించారు.

01/10/2020 - 06:13

యాదగిరిగుట్ట, జనవరి 9: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధ్యయనోత్సవాల్లో భాగంగా గురువారం లక్ష్మీనరసింహుడు ఉదయం నవనీతచోరునిగా, సాయంత్రం కాళీయమర్ధనుడి అవతారాల అలంకార సేవలో భక్తులను అనుగ్రహించారు.

01/10/2020 - 06:01

హైదరాబాద్, జనవరి 9: సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. సాధారణ ప్రజలు అటవీ సరిహద్దు గ్రామాల్లో పల్లె ప్రగతి వేదికగా అవగాహన పెంచుకోవాలన్నారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చిన జంగల్ బచావో, జంగల్ బడావో నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని ఆయన పిలుపు ఇచ్చారు.

01/10/2020 - 06:00

హైదరాబాద్, జనవరి 9: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ కోటాకు కేటాయించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఈ మేరకు అక్కడి ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. కరీంనగర్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లుగా విభజించినట్లు ఎన్నికల సంఘం స్పష్టం పేర్కొంది. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు ఎన్నికల నామినేషన్లు ఉంటాయని వెల్లడించింది.

01/10/2020 - 05:59

హైదరాబాద్, జనవరి 9: వైరల్ ఫీవర్‌తో అస్వస్థతకు గురైన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు పరామర్శించారు. గురువారం బంజారా హిల్స్‌లోని మంత్రి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులను సంప్రదించి ఆరోగ్య కుదుటపడేవిధంగా విశ్రాంతి తీసుకోవాలని మంత్రికి సూచించారు.

01/10/2020 - 05:57

హైదరాబాద్, జనవరి 9: వచ్చే ఏడాది జీడీపీ ఐదు శాతం వృద్ధి సాధిస్తుందన్న ముందస్తు అంచనాలతో ఆర్థిక వ్యవస్థలోకి మూలధనాన్ని క్రమపద్ధతిలో తెచ్చేందుకు పలు చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని ఫిక్కీ వాణిజ్య సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి కేంద్రాన్ని కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనాకు ఊహించిన విధంగానే ఉందన్నారు.

01/10/2020 - 05:57

హైదరాబాద్, జనవరి 9: ప్రపంచస్థాయి పంటలకు తెలంగాణ అనుకూలమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ వాతావరణ పరిస్థితులు ప్రపంచంలో కొన్నిచోట్ల మాత్రమే ఉన్నాయని, నాణ్యతా ప్రమాణాలు పెంచితే ప్రపంచంలో తెలంగాణ ఉత్పత్తులు నంబర్ వన్ అవుతాయని మంత్రి తెలిపారు.

Pages