S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/21/2015 - 02:25

హైదరాబాద్, నవంబర్ 20: నీటిపారుదల ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నిర్మాణంలోవున్న ప్రాజెక్టులతోపాటు కృష్ణానదిపై పాలమూరు, డిండి, గోదావరిపై కాళేశ్వరం, ప్రాణహిత, దుమ్ముగూడెం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతుకు సాగునీరు అందించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.

11/21/2015 - 02:23

హైదరాబాద్, నవంబర్ 20: ప్రభుత్వ కార్యాలయాల్లో, అధికారిక కార్యకలాపాల్లో దుబారా అరికట్టాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో ఈ అంశంపై సిఎం చర్చించారు. ఆదా మొత్తాన్ని అభివృద్ధి, సంక్షేమానికి వినియోగించాలని సూచించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా దీన్ని గుర్తించాలని, గతంతో పోలిస్తే పరిస్థితిలో మెరుగుదల కనిపించాలన్నారు.

06/24/2015 - 11:39

కరీంనగర్ టౌన్, జూన్ 23: ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తామన్న పాలకుల మాటలు నీటిమూటలనే మాటలు నిజమయ్యాయి. ఏటా వందలాది కోట్లు వెచ్చించి వౌలిక వసతులు కల్పిస్తున్నామంటూ చెప్పుకునే నేతలు తమ మాటలకు కార్యరూపం పెట్టడంలో విఫలమవుతుండగా, విడుదలవుతున్న నిధులు మధ్యలోనే మాయమవుతుండగా, వౌలిక వసతుల కల్పన కల్లగానే మారుతోందనేది సుప్రీంకోర్టు బృందం తనిఖీల్లో స్పష్టమైంది.

06/24/2015 - 11:38

కౌడిపల్లి, జూన్ 23: హైదరాబాద్‌కు చెందిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను మెదక్ జిల్లా కౌడిపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తూప్రాన్ డిఎస్పీ వెంకటేశ్వర్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి దొంగల ముఠా సభ్యుల వివరాలను వెల్లడించారు.

06/24/2015 - 10:35

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణలో లారీల యజమానులు సమ్మె సైరన్ మోగించారు. డిమాండ్ల పరిష్కారంపై లారీ యజమానుల సంఘం నేతలు మంగళవారం ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. లారీ యజమానులు ముందుంచిన డిమాండ్లను పరిష్కరించేందుకు వారం గడువుకావాలని ప్రభుత్వం కోరింది. ఇందుకు లారీ యజమానులు అంగీకరించపోవడంతో ముందుగా ప్రకటించినట్లుగానే మంగళవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నామని వారు స్పష్టం చేశారు.

06/24/2015 - 10:30

ములుగు, జూన్ 23: ఓటుకు నోటు ఆంశంలో ఎలాగైనా శిక్ష తప్పదనే భయంతో ఎపి సిఎం చంద్రబాబు కేంద్రాన్ని మేనేజ్‌చేసి సెక్షన్ 8ని తెరపైకి తెస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. మంగళవారం మెదక్ జిల్లా ములుగు మండల కేంద్రంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు.

03/14/2015 - 11:08

హైదరాబాద్, మార్చి 13: అరుదైన గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న ఇద్దరు మహిళా రోగులు శుక్రవారం సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు రోగులూ బ్రెయిన్‌డెడ్ కేసుల్లో అవయవ దానం వల్ల పునర్జన్మ పొందినవారే కావడం విశేషం. ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ జిఎస్ రావు, వైద్యులు ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే, శశికాంత్ విలేఖరులతో మాట్లాడారు.

03/14/2015 - 11:07

హైదరాబాద్, మార్చి 13: రానున్న రెండు, మూడు నెలల్లో ఇసుక తరలింపునకు సంబంధించి ప్రత్యేక పాలసీని అమలు చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు శాసన మండలిలో శుక్రవారం వెల్లడించారు.

Pages