తెలంగాణ

సర్కారు బడుల్లో వసతులు డొల్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూన్ 23: ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తామన్న పాలకుల మాటలు నీటిమూటలనే మాటలు నిజమయ్యాయి. ఏటా వందలాది కోట్లు వెచ్చించి వౌలిక వసతులు కల్పిస్తున్నామంటూ చెప్పుకునే నేతలు తమ మాటలకు కార్యరూపం పెట్టడంలో విఫలమవుతుండగా, విడుదలవుతున్న నిధులు మధ్యలోనే మాయమవుతుండగా, వౌలిక వసతుల కల్పన కల్లగానే మారుతోందనేది సుప్రీంకోర్టు బృందం తనిఖీల్లో స్పష్టమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులైన తాగునీటి, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడంలో యంత్రాంగం ఏమేరకు పనిచేసిందో క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించేందుకు వచ్చిన సుప్రీం కోర్టు బృందం ఖంగుతినే నిజాలను గుర్తించింది. కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకోసం ఏర్పాటు చేసిన తాగునీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యాలను పరిశీలించేందుకు రెండురోజులుగా సుప్రీంకోర్టు బృందం జిల్లాలో పర్యటించింది. జిల్లా కేంద్రంతో పాటు పరిసర పాఠశాలలు, రామడుగు, గంగాధర, కొడిమ్యాల, జగిత్యాల డివిజన్‌లోని పలు ప్రభుత్వ పాఠశాలలు బృందం సభ్యులు పరిశీలించి, అనేక లోపాలు గుర్తించారు. ఆయాచోట్ల జరిగిన అనేక అవినీతి, అక్రమాలను పసిగట్టారు. నిబంధనలు విస్మరించిన పాఠశాలల సిబ్బందిపై ఆగ్రహించారు.
పలుచోట్ల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు కలిసే ఉండగా, రెండింటికీ కలిపి ఒకేచోట మరుగుదొడ్లు నిర్మించడం, మరికొన్నిచోట్ల తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి వినియోగిస్తుండడాన్ని చూసి ఖంగుతిన్నారు. వీటినే బాలబాలికలు ఉమ్మడిగా ఉపయోగించడం పట్ల హతాశులయ్యారు. మరికొన్నిచోట్ల పాఠశాలలు ఓచోట, మరుగుదొడ్లు మరోచోట నిర్మించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాగునీటి సౌకర్యం అంతంతమాత్రమే ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల్లోని సౌకర్యాలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, తగిన సూచనలు అందించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శించడం పట్ల బృందంలోని సభ్యులు అసహనం వ్యక్తం చేశారు.
దేశ భవిష్యత్తుకు మూలస్తంభాలైన విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వం, విద్యాశాఖ సిబ్బంది, పేరెంట్స్ కమిటీలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం విద్యారంగ ప్రగతికి గొడ్డలిపెట్టులా మారుతుండగా, బాలబాలికల్లో వస్తున్న అనేక వ్యాధులకు పరోక్షంగా కారకులవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం చేయడం గమనార్హం. రెండురోజులుగా పరిశీలించిన జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లోని ఈ వసతుల లేమిపై సమగ్ర నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయనున్నారు.
చిత్రం... జగిత్యాల డివిజన్‌లోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి ప్రధానోపాధ్యాయుల నుంచి వివరాలు సేకరిస్తున్న సుప్రీంకోర్టు బృందం