తెలంగాణ

లారీల.. సమ్మె హారన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణలో లారీల యజమానులు సమ్మె సైరన్ మోగించారు. డిమాండ్ల పరిష్కారంపై లారీ యజమానుల సంఘం నేతలు మంగళవారం ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. లారీ యజమానులు ముందుంచిన డిమాండ్లను పరిష్కరించేందుకు వారం గడువుకావాలని ప్రభుత్వం కోరింది. ఇందుకు లారీ యజమానులు అంగీకరించపోవడంతో ముందుగా ప్రకటించినట్లుగానే మంగళవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నామని వారు స్పష్టం చేశారు. దీంతో తెలంగాణలో రెండున్నర లక్షల లారీలు, డిసిఎంలు ఎక్కడిక్కడే నిలిచిపోనున్నాయి. లారీల సమ్మెతో సరుకు రవాణా వ్యవస్థ స్తంభించిపోనుంది. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. రవాణా, రోడ్డు, భవనాల శాఖ ముఖ్య కార్యర్శి సునీల్ శర్మ లారీ యాజమానుల అసోసియేషన్‌తో సచివాలయంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎంతపన్ను చెల్లించామో, తెలంగాణ రాష్ట్రంలోనూ అంతే పన్ను విధించడం వల్ల లారీ యాజమానులపై భారం పడుతోందని అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ విధానాన్ని ప్రభుత్వం సరిచేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని కోరారు. డీజిల్‌పై లీటరుకు విధిస్తున్న నాలుగు రూపాయల రద్దు చేయాలని, ప్రమాదాల సమయంలో లారీ డ్రైవర్ల లైసెన్స్‌ల సస్పెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని, డ్రైవర్లకు స్టేషన్ బెయిలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇలా మొత్తం 14 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి వారం రోజుల గడువుకావాలని సునీల్ శర్మ కోరారు. ఇందుకు లారీ యజమానుల అసోసియేషన్ నిరాకరించింది. అర్ధరాత్రి నుంచి యథాతథంగా సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేసింది.