తెలంగాణ

దుబారాకు బ్రేక్ వేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: ప్రభుత్వ కార్యాలయాల్లో, అధికారిక కార్యకలాపాల్లో దుబారా అరికట్టాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో ఈ అంశంపై సిఎం చర్చించారు. ఆదా మొత్తాన్ని అభివృద్ధి, సంక్షేమానికి వినియోగించాలని సూచించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా దీన్ని గుర్తించాలని, గతంతో పోలిస్తే పరిస్థితిలో మెరుగుదల కనిపించాలన్నారు. మంత్రులు, శాఖాధిపతులు తమ శాఖల పరిధిలో ఏమేరకు ఖర్చులు తగ్గించుకోవచ్చో సమావేశాలు నిర్వహించుకుని గుర్తించాలని సూచించారు. అధికారులు అందరికీ దుబారా వ్యయాలను అరికట్టడానికి సూచనలు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు.
ఇదిలావుంటే, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తోచ్‌వాంగ్, అకౌంటెంట్ జనరల్ లతా మల్లికార్జున్ సచివాలయంలో శుక్రవారం సిఎం కెసిఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ఏడాది వచ్చిన ఆదాయ, వ్యయాలను సిఎం వారికి వివరించారు. వచ్చే ఏడాది బడ్జెట్ రూపకల్పన కోసం చేస్తోన్న కసరత్తును సిఎంకు వివరించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి ఆ శాఖకు బడ్జెట్‌లో నేరుగా కేటాయించాలని యోచిస్తోన్నట్టు సిఎం వెల్లడించారు. తమపరంగా కొత్త రాష్ట్రానికి అన్ని విధాల సహకరిస్తామని సిఎంకు ఎజి చెప్పారు.
చీఫ్ కన్సర్వేటర్ సమావేశం
అటవీశాఖను మరింత బలోపేతం చేయడానికి త్వరలోనే పూర్తి స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చెప్పారు. అటవీశాఖ చీఫ్ కన్సర్వేటర్ పికె శర్మ శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా కాపాడటానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అటవీ భూములలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, అడవులను పరిరక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.