S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/28/2015 - 06:03

అలంపూర్, నవంబర్ 27: అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన జోగులాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికల సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని శ్రీ జోగులాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను నిరంజన్‌రెడ్డి సతీసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు.

11/28/2015 - 05:24

జగదేవ్‌పూర్, నవంబర్ 27: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పించిన అయుత చండీయాగానికి శుక్రవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అంకురార్పణ చేశారు. డిసెంబర్ 23 నుండి 27 వరకు శైవ సంప్రదాయంలో జరిగే ఈ యాగానికి అంకురార్పణగా కేసిఆర్ దంపతులతో అర్చకులు హోమం నిర్వహింపజేశారు.

11/28/2015 - 05:18

హైదాబాద్, నవంబర్ 27: ఖైదీల సంస్కరణ, పరిపాలన విభాగంలోతెలంగాణ జైళ్లశాఖ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం మలక్‌పేట నల్గొండ చౌరస్తా వద్ద రూ.5.60కోట్ల వ్యయంతో నిర్మించిన తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయాన్ని ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు.

11/28/2015 - 05:11

హైదరాబాద్, నవంబర్ 27: సరస్వతి నిలయమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలో బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకుని తీరతామని హిందు మత సంస్థలు హెచ్చరించాయి. డిసెంబర్ 10వ తేదీన ఒయు ఆవరణలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తే తాము అడ్డుకుని నిరసన తెలుపుతామని ఆ సంస్థల ప్రతినిధులు హెచ్చరించారు.

11/28/2015 - 04:59

హైదరాబాద్, నవంబర్ 27: రాబోయే రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుప్రఖ్యాతులు మరింత పెరుగుతాయని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్‌రావు అన్నారు. ‘్భరత రాజ్యాంగానికి 65 వసంతాలు’ అంశంపై శుక్రవారం భారతీయ విద్యా భవన్‌లో ఏర్పాటైన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

11/28/2015 - 04:58

హైదరాబాద్, నవంబర్ 27: తెలంగాణ రాష్ట్రంలో గుర్తించిన 44 మార్కెట్ యార్డుల కంప్యూటరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి మార్కెటింగ్ శాఖపై సమీక్షించారు. పత్తి కొనుగోళ్లు, నూతన గొడౌన్ల నిర్మాణం, కోల్డ్‌స్టోరేజిలు, హమాలీలకు ఇన్సూరెన్స్, హెల్త్ క్యాంప్‌ల నిర్వహణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

11/28/2015 - 04:57

హైదరాబాద్, నవంబర్ 27: వరంగల్ ఉప ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను తారు-మారు చేశారని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ విమర్శించారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయనున్నట్లు ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఆయన చెప్పారు.

11/28/2015 - 04:56

హైదరాబాద్, నవంబర్ 27:తెలంగాణలో కొత్తగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తెలిపారు. కాలేజీల ఏర్పాటుపై ప్రతిపాదనలు అందజేయాలని వైద్య శాఖ ముఖ్యకార్యదర్శిని ఆయన ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీల వివరాలను కూడా సమర్పించాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

11/28/2015 - 04:55

హైదరాబాద్, నవంబర్ 27: మహానగరంలో మెట్రోరైలు పనులకు సంబంధించి ప్రభుత్వం ముందుగా ప్రతిపాదించిన రూట్లలోనే పనులు చేపట్టనున్నట్లు మెట్రో కన్సార్టియం సంస్థ ఎల్ అండ్ టి మేనేజింగ్ డైరెక్టర్ గాడ్గిల్ చేసిన ప్రకటన సుల్తాన్‌బజార్ వ్యాపారులను ఆందోళనకు గురి చేసింది.

11/28/2015 - 04:55

హైదరాబాద్, నవంబర్ 27; గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓటర్ల తొలగింపు వ్యవహారం తేలకుండా బిసి ఓటర్ల లెక్కింపును చేపట్టడాన్ని నిలిపివేయాలని కోరుతూ టిడిపి నాయకుడు ఫిరోజ్‌ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు హైకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ సివి నాగార్జునరెడ్డి ఆనాసక్తి వ్యక్తం చేశారు.

Pages