S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/21/2015 - 06:02

వరంగల్, నవంబర్ 20: వరంగల్ ఉప ఎన్నికలో గెలుపోటములపై ఎవరి ధీమాలో వారున్నారు. పార్లమెంటు ఉప ఎన్నికలో 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ అధికార టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపిల మధ్యే త్రిముఖ పోటీ నెలకొంది. వీరితో పాటు వైఎస్సార్‌సిపి అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్, వామపక్షాలు బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి గాలి వినోద్‌కుమార్ కూడా ఎన్నికల ప్రచారాన్ని దీటుగానే కొనసాగించారు.

11/21/2015 - 06:02

వరంగల్, నవంబర్ 20: వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 21న (నేడు) జరిగే పోలింగ్ కోసం యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో జరిగే పోలింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అందుకోసం 20 కంపెనీల భద్రతా దళాలు మోహరించారు.

11/21/2015 - 06:00

సిద్దిపేట, నవంబర్ 20 : తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తుందని, రద్దు బదిలీ పథకం, సాదాబైనామాలపై పట్టా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో శుక్రవారం సాయంత్రం అంబేద్కర్ భవన్‌లో అకాల వర్షాలకు దెబ్బతిన్న ఇళ్ల బాధితులకు నష్టపరిహారం చెక్కులు అందజేశారు.

11/21/2015 - 06:00

నల్లగొండ, నవంబర్ 20: తెలంగాణ జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం, పత్తి దిగుబడుల అమ్మకాల్లో రైతన్నల కష్టాలు కొనసాగుతున్నాయి. కరవుతో దెబ్బతిన్న పంటల నుండి దక్కిన అరకొర దిగుబడులను వ్యయప్రయాసల మధ్య కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయిస్తే సకాలంలో డబ్బులు అందక రైతన్నలు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు.

11/21/2015 - 05:59

కరీంనగర్, నవంబర్ 20: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న, పోలీస్ శాఖను కుదిపేస్తున్న ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి ఉదంతంలో సిఐడి, పోలీస్, ఎసిబి, ఐటి శాఖలు చతుర్ముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నాయి.

11/21/2015 - 05:42

ఖమ్మం, నవంబర్ 20: హిందు సంప్రదాయం ప్రకారం రాష్ట్రంలోనే మొదటి సారిగా గోతులాభారాన్ని శుక్రవారం ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించారు. సంస్కృతి, సాంప్రాదాయాలను తెలియ చేస్తూ గోవుల ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై భక్త్భివాన్ని చాటుకున్నారు. గోవుకు అత్యంత ప్రీతిపాత్రమైన దాణాతో తులాభారాన్ని నిర్వహించారు.

11/21/2015 - 05:30

ఖమ్మం, నవంబర్ 20: మావోయిస్టుల వద్ద బందీలుగా ఉన్న అధికార టిఆర్‌ఎస్ పార్టీ నేతలు ఇంకా చెర వీడలేదు. వారిని విడిపించేందుకు పోలీసులు, కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సత్ఫలితాలు ఇవ్వటం లేదు. నేతలు అపహరించబడిన పూసుగుప్ప గ్రామస్థులను పోలీసులు మావోల వద్దకు మధ్యవర్తులుగా పంపించినట్లు తెలుస్తోంది. అయితే వారి వద్ద నుంచి ఎటువంటి సమాచారం రాలేదు.

11/21/2015 - 02:35

కోహెడ, నవంబర్ 20: హుస్నాబాద్ నియోజకవర్గంలో సాగునీటి సౌకర్యం కల్పించేందుకుగాను చేపట్టిన గౌరవెల్లి-గండిపెల్లి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.1200కోట్ల నిధులను మంజూరు చేసినట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్‌రావు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లిలో పెద్ద వాగుపై రూ.11.15కోట్ల వ్యయంతో చెక్‌డ్యాం కం బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం పనులకు శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేశారు.

11/21/2015 - 02:34

హైదరాబాద్, నవంబర్ 20: రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన వరంగల్ ఉప ఎన్నిక సంరంభం ఆరంభమైంది. శనివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల్లో గెలుపుపైకన్నా ఓటింగ్ శాతం ఎంత ఉంటుంది? విజేత మెజారిటీ ఎంత? అనే అంశాలపైనే ఉత్కంఠత నెలకొంది. గత ఎన్నికల్లో 76.15శాతం పోలింగ్ జరిగింది. 2009లో 69.22శాతం పోలింగ్ నమోదైంది.

11/21/2015 - 02:28

హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ని ఆదుకునేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.137 కోట్లు నిధులు అందించే ఏర్పాట్లు చేశామని తెలంగాణ రవాణ శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి అన్నారు. రూ.150 కోట్ల వ్యయంతో 500 కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు సిఎం కెసిఆర్ అనుమతి ఇచ్చారని అన్నారు.

Pages