S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/28/2015 - 11:25

నల్గొండ: భువనగిరి రైల్వేస్టేషన్‌లో శనివారం ఉదయం రైల్వే పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రయాణీకుల బ్యాగులను, ఇతర సామాగ్రిని పరిశీలించారు. టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు.

11/28/2015 - 11:24

మెదక్: పొలంలో మూత వేయకుండా వదిలేసిన బోరుబావిలో మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు పడిపోయిన సంఘటన పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండా వద్ద శనివారం ఉదయం జరిగింది. ఇంటి పరిసరాల్లో ఆడుకుంటున్న బాలుడు బోరు బావిలో పడిపోవటాన్ని చూశామని తల్లిదండ్రులు మొగులమ్మ, సాయిలు చెబుతున్నారు. ఉదయానే్న పొలానికి నీరు పెట్టాక బోరుబావిపై తాను మూత పెట్టలేదని సాయిలు తెలిపాడు.

11/28/2015 - 06:09

హైదరాబాద్, నవంబర్ 27: వరంగల్ ఘన విజయంతో ఊపుమీదున్న తెరాస, రాజధాని గుండె గ్రేటర్‌పై దృష్టిపెట్టింది. జిహెచ్‌ఎంసి ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న తెరాస, ఇప్పటికే నగరవ్యాప్తగా ప్రభుత్వ పథకాలతో భారీ హోర్డింగ్‌లు ఏర్పాటుచేసి ప్రచారం మొదలుపెట్టింది. సగటున ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబానికి ఆసరా పథకం కింద నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ అందుతోంది.

11/28/2015 - 06:08

నల్లగొండ, నవంబర్ 27: నల్లగొండ జిల్లా అంతటా వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ మూసీ నది చలవతో చెరువులు నిండుగా ఉండటంతో ఆయకట్టులో రబీ వరి పంటలు పండించాలనుకున్న రైతుల ఆశలకు బ్రేక్ పడింది.

11/28/2015 - 06:07

వరంగల్, నవంబర్ 27: వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణమేమిటి..? సొంత పార్టీ మనుషులే తమ అభ్యర్థికి వెన్నుపోటు పొడిచారా...? అనేక ఆటుపోట్లు ఎదురైనా సందర్భాల్లోనూ తట్టుకొని నిలబడిన కాంగ్రెస్‌కు ఇంతటి అపజయం ఎదురుకావడం వెనక తమ పార్టీ మనుషుల హస్తమే ఉన్నట్లు అధిష్ఠాన వర్గం అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు అధికార పార్టీ జోరు..!

11/28/2015 - 06:06

ములుగు టౌన్, నవంబర్ 27: వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా పరిధిలోని ప్రాజెక్ట్‌నగర్ గ్రామ శివారులో దర్వాజగుట్ట వద్ద ఒర్రెలో శుక్రవారం డిఎస్పీ రాజమహేంద్రనాయక్ ఆధ్వర్యంలో డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ ఎస్పీ జాన్‌వెస్లీ ములుగు డిఎస్పీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

11/28/2015 - 06:06

చౌటుప్పల్, నవంబర్ 27: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మనాగారం శివారులో శుక్రవారం ఉపాధి పనులు చేస్తుండగా విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. దేవలమ్మ నాగారం నుంచి అల్లాపురం రోడ్డు వరకు ఉపాధి పనులతో రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్నారు. రోడ్డుకు మట్టిని పోసేందుకు ఉపాధి కూలీ బొమ్మ పెంటయ్య గడ్డపలుగు వేస్తుండగా రాయి తగిలింది. అనుమానం వచ్చి మరింత లోతుగా తవ్వడంతో విగ్రహం బయటపడింది.

11/28/2015 - 06:05

నర్సాపూర్, నవంబర్ 27: మెదక్ జిల్లా నర్సాపూర్ రేంజ్ అధికారి మధుసూదన్‌రావు పది వేల లంచం తీసుకుంటూ శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. ఎసిబి నిజామాబాద్ డిఎస్‌పి సూర్యనారాయణ కథనం ప్రకారం... వికారాబాద్‌కు చెందిన వైద్యనాథ్ సదాశివపేటలో సామిల్ ఏర్పాటుకు రెండు నెలల క్రితం మెదక్ డిఎఫ్‌ఓ కార్యాలయంలో దరఖాస్త్తు చేసుకొన్నాడు.

11/28/2015 - 06:05

షాద్‌నగర్ (మహబూబ్‌నగర్), నవంబర్ 27: నిజాం హయాంలో 72 ఏళ్ల క్రితం నిర్ణయంచిన సరిహద్దులనే ఇప్పటికీ కొనసాగించడం.. సర్వేలు తిరిగి జరపకపోవడంతో గ్రామాల్లో రైతులు అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. ఈ కారణంగా గ్రామాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. భూ తగాదాలు, హత్యలు, కేసులు ఎక్కువ అవుతున్నాయి.

11/28/2015 - 06:04

మహబూబ్‌నగర్ / కరీంనగర్ / వరంగల్, నవంబర్ 27: పంటల కోసం చేసిన అప్పలు తీర్చలేక.. ఒత్తిడులు తట్టుకోలేక మనస్తాపంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. శుక్రవారం రాష్ట్రంలో అప్పుల బాధతో ముగ్గురు రైతులు ఆత్మహత్యకు తెగబడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం మధురాపూర్ గ్రామానికి చెందిన గన్నమోని అంజమ్మ (55) అనే మహిళా రైతు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకొంది.

Pages