S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/30/2015 - 05:08

సంగారెడ్డి, నవంబర్ 29: మానవత్వం ముందు కులం, మతం, ప్రాంతం, వయోభేదం, ఖర్చులన్ని దిగదుడుపే అని నల్గొండ జిల్లా వాసులు రుజువు చేశారు. మెదక్ జిల్లా పుల్‌కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం గ్రామంలో శనివారం ఉదయం బోరుబావిలో పడిపోయిన రాకేష్‌ను రక్షించడానికి అధికార యంత్రాంగం, జాతీయ విపత్తుల నివారణ బలగాల సిబ్బంది వచ్చినా బాలుడిని రక్షించలేకపోయారు.

11/30/2015 - 05:07

ధర్మపురి, నవంబర్ 29: భారతదేశ ప్రాచీన నాగరికత, సభ్యతా సంస్కృతులకు మూలాధారాలైన , ప్రాత: స్మరణీయాలైన నదులను పరిరక్షించు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మైసూరు అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద సరస్వతి స్వామి ఉద్భోదించారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి క్షేత్రంలో గోదావరికి మహాహారతి సమర్పించిన విశేష కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

11/30/2015 - 04:58

సంగారెడ్డి, నవంబర్ 29: కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువస్తున్న వస్తుసేవల పన్నుల విధింపు బిల్లు ఆమో దం కోసం బిజెపి, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని, ఎన్డీఎ-యుపిఎ కూటమిల మ్యాచ్ ఫిక్సింగ్ మరో మారు స్పష్టమైందని సిపిఎం జాతీయ కార్యదర్శి సీతా రాం ఏచూరి ఆరోపించారు.

11/30/2015 - 03:26

హైదరాబాద్, నవంబర్ 29: అతి ప్రాచీన ఆదివాసి తెగ చెంచుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. ఆదిమానవులను గుర్తుకుతెచ్చేలా వీరి జీవన విధానం ఉంటుంది. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతానికి మాత్రమే చెంచులు పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో జాతి అంతరించిపోకుండా అధికారులు అక్షయపాత్ర పథకం అమలుకు ప్రయత్నిస్తున్నారు.

11/30/2015 - 03:24

సంగారెడ్డి, నవంబర్ 29: ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన రాకేష్‌ను రక్షించేందుకు అధికార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మూడేళ్ల చిన్నారనికి బోరుబావి మింగేసింది. 24 గంటలపాటు శ్రమించిన అధికారులు చిట్టచివరకు రాకేష్ మృతదేహానే్న వెలికితీశారు. ఆదివారం ఉదయం 6.30కు మృతదేహాన్ని బోరు మోటారును పైకితీసిన విధానంలోనే తీశారు.

11/30/2015 - 03:19

వరంగల్, నవంబర్ 29: తెలంగాణలో పత్తి రైతు బాధలు ప్రభుత్వానికి తెలుసని, సమస్య పరిష్కారం కోసం త్వరలోనే ప్రధాని మోదీని కలుస్తామని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

11/30/2015 - 03:15

హైదరాబాద్, నవంబర్ 29: ప్రాజెక్టుల రీ-డిజైన్‌కు అనుగుణంగా కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణం జరగాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. అలాగే గతంలో నిర్మించిన ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు రీ-డిజైన్ల ద్వారా ఆయకట్టు స్థిరీకరణ జరిగేలా కాల్వలు, ప్రాజెక్టులకు మరమ్మతులు నిర్వహించాలని సూచించారు.

11/28/2015 - 15:23

వరంగల్‌ : డోర్నకల్‌ రైల్వేస్టేషన్‌లో శనివారం సాయినగర్‌-విశాఖ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ నుంచి పొగలు వెలువడ్డాయి. బ్రేక్‌ పట్టేయడంతో ఏసీ బోగీ కింద నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేసి తనిఖీ చేపట్టారు.

11/28/2015 - 11:26

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా పులిమడుగులో పోలీసు, అటవీ, ఎక్సైజ్ సిబ్బంది శనివారం ఉదయం దాడులు చేసి, భారీగా గుడుంబా, బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నారు. 30 బైక్‌లను, లక్ష రూపాయలు విలువచేసే టేకు కలపను కూడా స్వాధీనం చేసుకొని పది మందిని అరెస్టు చేశారు.

11/28/2015 - 11:25

మహబూబ్‌నగర్: దౌలతాబాద్ మండలం చంద్రకల్‌లో తండ్రీ, వదినలను రోకలి బండతో మోది మతిస్థిమితం లేని వ్యక్తి హత్యలకు పాల్పడ్డాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Pages