తెలంగాణ

కరోనా కట్టడిపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఏప్రిల్ 13: అమెరికా యూఎస్‌ఏ నుంచి వచ్చిన హబ్సిగూడ కాకతీయనగర్ స్ట్రీట్ నెంబర్ 3లో నివసిస్తున్న ఓ యువతికి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె తల్లిదండ్రులు రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డీలో క్వారంటైన్‌లో ఉన్నారు.
నిర్వహించిన పరీక్షల్లో తండ్రికి నెగిటివ్ రావడంతో ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రాణాలతో చెలగాటమాడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి ప్రత్యేక దృష్టి పెట్టింది. హబ్సిగూడ కాకతీయనగర్‌ను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. పరిసర ప్రాంతాల్లో బయటకు రాకుండా ఇంటికే పరిమితం కావాలని ఆంక్షలను కఠినతరం చేసింది.
నిత్యావసర వస్తువులను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. మున్సిపల్ సిబ్బందిని అందుబాటులో పెట్టారు. నిత్యం పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తూ ప్రస్తుతం కాకతీయనగర్ పోలీసు పహారాలో బంధీ అయింది. అనవసరంగా బయటకు వస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
వైద్య సాయం కోసం ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. ఇక్కడి పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపటి, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ కృష్ణ శేఖర్, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

*చిత్రం...హబ్సిగూడ కాకతీయనగర్‌లో పర్యటిస్తున్న
ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపటి.