తెలంగాణ
అధైర్య పడవద్దు ధాన్యం కొనుగోలు చేస్తాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మేడ్చల్, ఏప్రిల్ 13: రైతులు అధైర్య పడవద్దని ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని పూడూరు, మేడ్చల్ పీఏసీఎస్ కార్యాలయాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని స్పష్టం చేశారు. కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రా రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నందారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్, ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి, మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల చైర్ పర్సన్‌లు మర్రి దీపికా నర్సింహా రెడ్డి, మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
*చిత్రం...మేడ్చల్ పీఏసీఎస్ కార్యాలయం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి మల్లారెడ్డి