తెలంగాణ

కరోనా పాజిటివ్ 27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ప్రభుత్వ లెక్కలే తెలియచేస్తున్నాయి. ఆదివారానికి కరోనా పాజిటివ్‌గా తేలిన వారి సంఖ్య 27కు చేరింది. కరోనా పాజిటివ్‌గా తేలిన వారి వివరాలను ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆదివారం సాయంత్రం వెల్లడించారు.
* ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన 24 ఏళ్ల యువకుడు దుబాయి మీదుగా లండన్‌నుండి హైదరాబాద్ వచ్చాడు. కరోనా ఉందని నిర్దారణ కావడంతో ప్రభుత్వం గుర్తించిన దవాఖానలో చికిత్సకోసం చేర్పించారు.
* హైదరాబాద్ (కూకట్‌పల్లి) కు చెందిన 23 సంవత్సరాల విద్యార్థి దోహ మీదుగా లండన్ నుండి ఇటీవల వచ్చాడు. అతడికి జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలడంతో దవాఖానాలో చేర్పించి చికిత్స చేస్తున్నారు.
* ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన 26 సంవత్సరాల విద్యార్థి ఈ నెల 16 న స్వీడన్ నుండి హైదరాబాద్ వచ్చాడు. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలడంతో దవాఖానాలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
* రంగారెడ్డి జిల్లా మణికొండకు చెందిన 34 ఏళ్ల వివాహితుడు ఈ నెల 14 న స్వీడన్ నుండి హైదరాబాద్ వచ్చాడు. అతడికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలడంతో దవాఖానాలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణానికి చెందిన అవివాహిత 23 ఏళ్ల యువకుడు లండన్ నుండి ఈ నెల 18 న హైదరాబాద్ వచ్చాడు. అతడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో దవాఖానాలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
* హైదరాబాద్‌కు చెందిన 50 సంవత్సరాల వివాహిత మహిళ దుబాయి నుండి ఈ నెల 14 న హైదరాబాద్ వచ్చింది. ఆమెకు కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలడంతో గుర్తింపు పొందిన దవాఖానాలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
* చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.