తెలంగాణ
జనతా కర్ఫ్యూకు ఐక్యత చాటుదాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మార్చి 21: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అడ్డుకుందామని, ప్రధాని నరేంద్రమోదీ జనతా కర్ఫ్యూకు ఐక్యతతో మద్దతు పలుకుదామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం నాడు ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కరోనాను నివారించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. జనతా కర్ఫ్యూ పాటించడం ద్వారా కరోనా చెయిన్‌ను రద్దు చేయగలుగుతామని చెప్పారు. జనతా కర్ఫ్యూ అమలుకు సంబంధించి గ్రామస్థాయి వరకూ చైతన్యం కల్పించామని, ప్రజలు అంతా ముందుకు వచ్చి ఆదివారం నాడు భారతదేశ ఐక్యతను ప్రదర్శించి, ప్రపంచానికి మంచి సందేశాన్ని ఇవ్వాల్సి ఉందని చెప్పారు. కుటుంబ సభ్యులతో ఆదివారం రాత్రి 9 గంటల వరకూ సుమారు 14 గంటల పాటు ఇంట్లోనే ఉండి కర్ఫ్యూను పాటిద్దామని చివరిలో కృతజ్ఞత ప్రకటించేందుకు ప్రధాని సూచన మేరకు చప్పట్లుతో మన సందేశాన్ని చెప్పాల్సి ఉందని చెప్పారు. కరీంనగర్‌లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, ఇండోనేషియా నుండి వచ్చిన వారితో కరోనా వ్యాపించే ముప్పు ఏర్పడిందని కనుక వారి విషయంలో పోలీసులు కఠిన చర్యలే తీసుకుంటున్నారని అన్నారు. కరోనా పాజిటివ్ కేసులు ఉంటే వారి గురించి సమాచారాన్ని ప్రజలు అధికారులకు అందించి నివారించే అవకాశాలను వినియోగించుకోవాలని చెప్పారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్