తెలంగాణ

అవసరమైతే టోటల్ షట్‌డౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో అవసరమైతే ‘టోటల్ షట్‌డౌన్’ చేస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు వెల్లడించారు. ప్రగతిభవన్‌లో శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, కరోనా వైరస్ తెలంగాణలో ఇప్పటివరకు అదుపులోనే ఉందన్నారు. విదేశాల నుండి వస్తున్న వారే కరోనా సోకినట్టు నిర్ధారణ అవుతున్నారన్నారు. తెలంగాణలో నివసిస్తున్న వారికి ఇప్పటివరకు కరోనా ఎఫెక్ట్ కాలేదన్నారు. అనుకోని పరిస్థితిలో చేయిదాటితే రాష్ట్ర వ్యాప్తంగా టోటల్ షట్‌డౌన్ చేస్తామని వివరించారు. అలాంటి పరిస్థితి రాకుండా చూసేందుకు ప్రభుత్వానికి ప్రజలంతా సహకారం అందించాలని కోరారు. ఒకవేళ టోటల్ షట్‌డౌన్ చేయాల్సిన పరిస్థితి వస్తే ప్రభుత్వమే ఇళ్లకు రేషన్ సరకులు, బియ్యం పంపిస్తుందని సీఎం తెలిపారు.