తెలంగాణ

లండన్‌లో చిక్కుకున్న విద్యార్థులను భారత్‌కు రప్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: లండన్‌లో చిక్కుకున్న విద్యార్థులను వెంటనే ఇండియాకు రప్పిచాలని, ఈ విషయమై రాష్ట్రప్రభుత్వం చొరవ చూపాలని తెలంగాణ ఎన్నారై ఫోరం డిమాండ్ చేసింది. విద్యార్థులకు అండగా ఉంటామని ఫోరం పేర్కొంది. ఎమిరేట్స్, ఇతైద్ ఎయిర్ లైన్స్‌లవ నిర్లక్ష్యం, భారత్ విమాన రాకపోకల రద్దు కారణంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించి 45 మంది విద్యార్థులు లండన్‌లో చిక్కుకున్నారన్నారు. వారిలో ఎవ్వరికీ కూడా ఇప్పుడు ఇల్లు లేదని, భోజనం లేదన్నారు. చివరికి ఇండియా హైకమిషన్‌లో ఉండగా తెలంగాణ ఎన్నారై ఫోరమ్ వారిని కలిపి భరోసా ఇచ్చిందన్నారు. కొందరికీ హోటల్‌లో ఉండేందుకు వసతి, భోజనం సదుపాయం కల్పించారన్నారు. వారంతరం కారణం అలాగే దేశ హోంశాఖకు సంబంధించిన అంశం అవడం వల్ల సాధ్యాసాధ్యాల పరిశీలనకు సమయం పట్టడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఫోరమ్ ఫౌండర్ గంప వేణుగోపాల్ శిబిరాన్ని సందర్శించి అందులో కొందరికీ హోటల్‌లో బస, భోజనం ఏర్పాట్లు చేసి ధైర్యాన్ని నింపారన్నారు. ఇండియన్ ఎంబసీ ఉన్నతాధికారులతో పరిష్కారంపై చర్చించగా, సోమవారం వరకు చెప్పలేమని తెలిపారని చెప్పారు. ఇండియన్ ఎంబసీ ఉన్నతాధికారులతో పరిష్కారంపై చర్చించగా సోమవారం వరకు ఏమి చెప్పలేమన్నారు. విద్యార్థులకు ఉండేంనదుకు వసతి, భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పినా ఒప్పుకోవడం లేదన్నారు. హైకమిషన్‌లోనే ఉంటామన్నారు. ఈ విషయమై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లామన్నారు. లండన్‌లో విద్యార్థులను కలిసి భరోసా ఇచ్చిన వారిలో ప్రవీణ్ రెడ్డి, రంగు వెంకట్, సుధాకర్ గౌడ్, మహేష్ జమ్ముల, ఆకుట వెంకట్, మహేష్ చట్ల, నర్సింహారెడ్డి, ఆశ, అశోక్ మేడిశెట్టి రవి తదితరులు ఉన్నారు.