తెలంగాణ

21 పాజిటివ్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా నిర్ధారణకు సంబంధించి శనివారం మధ్యాహ్నం వరకు 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్‌లో శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఇప్పటికే గాంధీ, ఉస్మానియా, ఐపీఎం, ఫీవర్ ఆసుపత్రి, చెస్ట్ దవాఖానాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. తన అభ్యర్థన మేరకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్
సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లో కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహంచేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంగీకరించారని తెలిపారు. ప్రధాన మంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని కోరానని సీఎం గుర్తు చేశారు. ప్రధాని వేగంగా స్పందించారని, సీసీఎంబీలో కరోనా వైరస్ నిర్ధారణ కోసం వైద్య పరీక్షలకు అంగీకరిస్తూ శనివారం వర్తమానం పంపించారన్నారు. సీసీఎంబీలో ఒకే పర్యాయం వెయ్యి శాంపిళ్లను పరీక్షించేందుకు అవకాశం ఉందని గుర్తు చేశారు. రాష్టస్థ్రాయిలో ఐదుగురు ఉన్నతాధికారులతో నిపుణుల కమిటీని నియమించామని సీఎం తెలిపారు. ఇందులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం, సీఎంఓ ఆఫీస్, సీఎస్ ఆఫీస్, డీజీపీ ఆఫీస్‌లకు చెందిన అధికారులు ఉంటారన్నారు. వీరు జాతీయ, అంతర్జాతీయంగా కరోనాపై జరుగుతున్న వివిధ కార్యక్రమాలను సమీక్షిస్తారని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 700 మందికి కరోనా అనుమానంతో ఐసోలేట్ చేసి చికిత్స అందిస్తున్నామని సీఎం తెలిపారు. 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచిన తర్వాత కౌనె్సలింగ్ చేస్తున్నామన్నారు. కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో 52 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, రాష్ట్రంలోకి వస్తున్న వారిని స్క్రీనింగ్ చేస్తున్నామని సీఎం తెలిపారు. కరోనా అనుమానం ఉన్నవారెవరూ బయట తిరగవద్దని సూచించారు. ఇప్పటివరకు పరిస్థితి ప్రభుత్వ కంట్రోల్‌లో ఉందని సీఎం తెలిపారు. కరోనా వైరస్ లక్షణాలు అనుమానం ఉన్న వారు అత్యుత్సాహంతో బయట తిరగవద్దని విజ్ఞప్తి చేశారు. విదేశాల నుండి వచ్చిన వారు కూడా తెలంగాణ బిడ్డలేనని, అయితే సమాజం హితం కోసం స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. మన చేతుల్లో ఉన్నంతవరకు మనం చర్యలు తీసుకోవాలన్నారు. స్వయంగా ఎవరికి వారు క్షేమంగా ఉంటూ, సమాజ క్షేమం కోసం నడవాలని సూచించారు.