S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/20/2019 - 04:01

మానవపాడు, సెప్టెంబర్ 19: గత అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురియడంతో కర్నూల్ నుంచి రాయచూరుకు వెళ్లే అంతర్‌రాష్ట్ర రహదారి ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామం వద్ద వాగులు పొంగి ప్రవహించాయ. దీంతో గంటలు తరబడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యవసర చికిత్స నిమిత్తం, అత్యవసర పనుల మీద వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

09/20/2019 - 01:21

ఆదిలాబాద్, సెప్టెంబర్ 19: బాహ్య ప్రపంచానికి ఆమడదూరంలో దుర్భర జీవనం సాగించే మారుమూల గిరిజన గ్రామాలకు కనీస రహదారి సౌకర్యం లేక వర్షాకాలంలో మరో నిండు ప్రాణం గాల్లో కలిసిపోయంది.

09/20/2019 - 05:04

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం తర్వాత పరిపాల సౌలభ్యం కొరకు జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శాసన సభలో ప్రకటించారు. ఈ కలెక్టరేట్లను కట్టడానకి ప్రభుత్వం రూ. 963 కోట్లను ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కలెక్టరేట్లు వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు.

09/20/2019 - 01:15

హైదరాబాద్, సెప్టెంబర్ 19: శారీరక దృఢత్వం కోసమే కాకుండా మనలో పాజిటివ్ ఎనర్జీని ప్రవేశపెట్టేందుకు ‘యోగా’ ఉపయోగపడుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లోని సాంస్కృతిక భవన్‌లో రాజ్‌భవన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకోసం గురువారం ఆమె యోగా తరగతులను ప్రారంభించారు.

09/20/2019 - 01:13

హైదరాబాద్, సెప్టెంబర్ 19: అర్హులైన కోటి రెండు వేల మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్టు పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. ఈ నెల 23 నుంచి చీరల పంపిణీకి శ్రీకారం చుడుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన వారు ఈ చీరలను పొందడానికి అర్హులన్నారు.

09/20/2019 - 01:11

హైదరాబాద్, సెప్టెంబర్ 19: ప్రభుత్వం తెస్తున్న అప్పులు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్న తపనతోనే తప్ప మరే ఇతరత్రా అవసరాలకు కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టులపై రాద్దాంతాలు, నిందారోపణలు మానుకుని, వాటి నిర్మాణాలకు సహకరించాలని ముఖ్యమంత్రి ప్రతిపక్షాలకు హితవు పలికారు.

09/19/2019 - 17:11

హైదరాబాద్: యువత యోగాను ఆచరించాలని గవర్నర్ తమిళసై అన్నారు. ఆమె రాజ్‌భవన్‌లో సిబ్బందికి యోగా తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ ఇచ్చిన ఫిట్ ఇండియా ఉద్యమానికి బలం చేకూర్చేలా మనందరం యోగా చేద్దామని అన్నారు. గవర్నర్ దంపతులు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని ఆసనాలు వేశారు.

09/19/2019 - 13:17

హైదరాబాద్: జనగామ జిల్లా దేవరుప్ప మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు. డీసీఎం వ్యాన్, కారు ఢీకొనటంతో ఈ ఘటన జరిగింది. మృతులు పెనుగొండ గణేశ్(60), పెనుగొండ సుకన్య(38), ఎండీనజీర్(డ్రైవర్)లుగా గుర్తించారు. మృతులు మహబూబాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడింది పెనుగొండ మంజుష, శ్రీలతలుగా గుర్తించారు. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

09/19/2019 - 05:20

హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాష్ట్ర శాసనసభ బుధవారం ఎనిమిది పద్దులకు ఆమోదం తెలిపింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు రిలీఫ్, ఆబ్కారీ, మద్య నిషేధం, రవాణా, వాణిజ్యపన్నులు, హోం, జైళ్లు, అగ్నిమాపక సేవలు, వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, పౌరసరఫరాల నిర్వహణల పద్దులను సభ ఆమోదం తెలిపింది.

09/19/2019 - 04:08

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ప్రముఖ క్రీడా వైద్య నిపుణుడు ప్రొఫెసర్ మేజర్ డాక్టర్ భక్తియార్ చౌదరి అరుదైన భిన్న జాతులకు చెందిన మొక్కలను సేకరించి ప్రపంచ రికార్డును నమోదు చేశారు. దీనికి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును అం దుకున్నారు. ఈ ఈఅవార్డును ఇఫ్లూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఇ సురేష్ కుమార్ చేతుల మీదుగా ఇక్కడ జరిగిన కార్యక్రమంలో స్వీకరించారు.

Pages