తెలంగాణ

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మాదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వనిదేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంజేందర్ శాసనమండలిలో స్పష్టం చేశారు. గుత్త సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన సభలో రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్ ప్రభావం), తీసుకున్న చర్యలపై లఘు చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న సభ్యులు రామ్‌చందర్‌రావు, ఎగ్గే మల్లేష్, సయ్యద్ అమీన్ ఉల్ హాసన్ జాఫ్రీ, నవీన్ కుమార్, జీవన్‌రెడ్డి, తేరా చెన్నప్పరెడ్డి, అకుల లలిత, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఫారుఖ్ హుస్సేన్, వీ.గంగాధర్ గౌడ్, ఎంఎస్.ప్రభాకర్‌లు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన్నప్పటికీ పలు సూచనలు చేశారు.
కరోనా విషయంలో అందోళన కలిగించే ప్రకటనలు ఉండవద్దని, కరోనా వ్యాధిపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు తగ్గట్టుగా ప్రభుత్వం ప్రచారం చేయాలని పైర్కొన్నారు. కరోనా వ్యాధి సోకకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ప్రశంసించారు. ఈ సందర్భంగా సభలో సభ్యులనుద్దేశించి మంత్రి మాట్లాడారు. కరోనా జాగ్రత్తలపై నిర్ణయం తీసుకుంటామని, ఈ విషయంలొ ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చే సూచనలను ప్రజలు తప్పకుండా పాటించాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చేవారు వెంటనే ఆసుపత్రులకు వెళ్లాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరికి కరోనా లేదని స్పష్టం చేశారు. ప్రజా ఆరోగ్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వం భరించేందుకు సిద్దంగా ఉందని మంత్రి ఈటల తెలిపారు. ఈ వ్యాధి రాష్ట్రంలో ఎవరికీ రాకుండా వుండేందుకు ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ మంత్రులతో కలిసి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి కరోనా వ్యాధి తెలంగాణ రాష్ట్రంలో ఎవరికీ రాకుండా అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించి అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. విదేశాల నుండి వచ్చిన వారి నుండి ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అవసరమైన ఆరోగ్య సిబ్బందిని నియమించి ప్రయాణికులకు ప్రభుత్వం తరపున పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
పుకార్లను నమ్మవద్దని, ఒక వేళ కరోనా వైరస్ ఎవరికైనా సోకినా ఎదుర్కోడానికి ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉందని సభలో ఈటల స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులను అప్రమత్తం చేశామని, కరోనా వ్యాధి ప్రభలకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని మంత్రి తెలిపారు.

*చిత్రం... కరోనాపై లఘు చర్చలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల