తెలంగాణ

తొమ్మిది పద్దులకు శాసనసభ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ శాసనసభ తొమ్మిది పద్దులకు శనివారం సాయంత్రం ఆమోదం తెలిపింది. రెవెన్యూ-రిలీఫ్, ఎక్సైజ్, వాణిజ్యపన్నులు, రవాణా, హోం, వ్యవసాయం, సహకారం, పశుసంవర్థకం, పౌరసరఫరాల పద్దులను ఆమోదించింది. ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వ్యవసాయం, సహకార రంగాల పద్దులపై జరిగిన చర్చకు సమాధానం చెబుతూ, సహకార రంగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. కేరళలో సహకరా రంగంలో 60 వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉందన్నారు. మన రాష్ట్రంలో ఈ రంగాన్ని పటిష్ట పరిచేందుకు ఎమ్మెల్యేలతో ఒక కమిటీ వేయాలని స్పీకర్‌ను మంత్రికోరారు. ఈ కమిటీ సహకార రంగం సజావుగా నడుస్తున్న రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక సమర్పిస్తే, సంస్కరణలు తీసుకువస్తామన్నారు. మన రాష్ట్రంలో ముల్కనూరులో విశ్వనాథం ప్రారంభించిన సహకార వ్యవస్థ దేశానికే ఆదర్శంగా ఉందని, అలాంటి సహకార వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే రైతులకు మేలు జరుగుతుందన్నారు. గతంలో ‘బోర్‌బావి తవ్వి బాగుపడ్డ రైతులేడు’అనే నానుడి అమల్లోకి వచ్చిందని, కేసీఆర్ హయాంలో కాలువలు, చెరువుల కింద దున్ని చెడిన రైతు లేడు’ అన్న నానుడి ఏర్పడ్డదని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 2019 ఖరీఫ్‌లో రాష్ట్రంలో 1.22 లక్షల ఎకరాలు సాగయిందని, ఇదొక రికార్డన్నారు. ప్రస్తుత యాసంగిలో కేవలం వరి మాత్రమే 38 లక్షల ఎకరాల్లో సాగయిందని తెలిపారు.
రాష్ట్రంలో శాంతి, భద్రతలు చాలా చక్కగా ఉన్నాయని హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. నక్సలైట్ల సమస్య లేదని, మతకలహాలు లేవని, దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా ఉపయోగిస్తున్నామని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కంట్రోల్ కమాండ్ సెంటర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అమెరికా తదితర ఒకటి రెండు దేశాల తర్వాత ఈ తరహా కేంద్రం ఏర్పాటు తెలంగాణలోనే ఉందన్నారు. పోలీసు శాఖను పూర్తిగా సంస్కరించామని, ‘ఫ్రెండ్లీ పోలిసింగ్’ విధానం అమల్లో ఉందన్నారు. మహిళల కోసం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 6,40,000 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయన్నారు. జైళ్ల శాఖలో కూడా సంస్కరణలు తీసుకువస్తున్నామని, ఖైదీలుగా వృద్దులు ఎవరైనా ఉంటే వారిని నెలరోజుల్లోగా జైళ్ల నుండి పంపించివేస్తామన్నారు. జైళ్లలో ఖైదీలుగా జీవనం కొనసాగిస్తున్న వారి పిల్లలకు మంచి విద్య అందుబాటులోకి తెస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు.
18 లక్షల బోగస్‌కార్డుల తొలగింపు
రాష్ట్రంలో 18 లక్షల కార్డులు బోగస్‌వి అని తేలిందని, వీటిని రద్దు చేశామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆధార్‌కార్డును ఈ-పీడీఎఫ్‌తో అనుసంధానం చేయడంతో బోగస్ కార్డులు వెలుగులోకి వచ్చాయన్నారు. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు.
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై త్వరలో 25 కోట్ల రూపాయల వ్యయంతో ‘నీరా కేఫ్’ను ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఎక్సైజ్ పద్దుపై జరిగిన చర్చకు సమాధానం చెబుతూ, జిల్లాల్లో కూడా ఈ తరహా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. తాటి, ఈత చెట్లను భారీగా పెంచుతున్నామన్నారు. హరితహారంలో భాగంగా ఈ తరహా మొక్కల పెంపకం చేపట్టామని వివరించారు. మద్య నిషేదంపై చట్టం వల్ల ఉపయోగం లేదని, ప్రజల్లో అవగాహన కల్పించడమే మద్యనిషేధానికి సరైన పరిష్కార మార్గమన్నారు. గీత కార్మికులు ఆత్మగౌరవంతో జీవించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రవాణాశాఖపై జరిగిన చర్చకు సంబంధిత మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమాధానం చెప్పారు.