తెలంగాణ

మూసీ ప్రక్షాళనకు చర్యలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 17: తెలంగాణ గంగగా పిలుచుకునే మూసీ నదిని ప్రక్షాళన, పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వినతిపత్రం అందించారు. మంగళవారం భారత రాష్టప్రతి రామ్‌నాథ్‌కోవిద్ పార్లమెంట్ సభ్యులకు ఇచ్చిన అల్పాహార విందుకు హాజరైన ఎంపీ వెంకట్‌రెడ్డి, విందు అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మూసీ కాలుష్యం, ప్రక్షాళన ఆవశ్యకతలపై లోక్‌సభలో తాను ప్రస్తావించి పర్యావరణ, జల వనరుల శాఖ మంత్రులకు స్వయంగా సమస్యను వివరించినా స్పందన కొరవడిందని వెంకట్‌రెడ్డి ఈ సందర్భంగా మోదీకి విన్నవించారు. ఫార్మాకంపెనీలు, డ్రైనేజీ నీళ్లతో మూసీ నది కాలుష్యమయమైందన్నారు. ప్రజారోగ్యం, పర్యావరణ సమతుల్యత, జీవ వైవిద్యం, సాగుతాగునీటి వనరుల సంరక్షణ, పంటల రక్షణ వంటి ప్రాధాన్యతల నేపథ్యంలో తక్షణమే మూసీ నది ప్రక్షాళనకు నమో గంగాతరహాలో నిధులు మంజూరు చేసి చర్యలు చేపట్టాలని ఆయన మోదీని అభ్యర్ధించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వెంటనే మూసీ ప్రక్షాళనకు తగిన ఆదేశాలివ్వాలని, ట్రిట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, నది వెంట పచ్చదనం, సుందరీకరణ, పరిశ్రమల వ్యర్థాల కట్టడికి చర్యలు తీసుకోవాలని వెంకట్‌రెడ్డి కోరారు. మోదీతో భేటీ పిదప మీడియాతో మాట్లాడిన వెంకట్‌రెడ్డి మూసీ ప్రక్షాళనకు నిధులు మంజూరు చేసి చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు ఫార్మాసిటీని హైద్రాబాద్ శివారు నుండి దూరంగా తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి టీఆర్‌ఎస్ పాలనలో గాడి తప్పిందని, రాష్ట్రం ఇప్పటికే నాలుగులక్షల కోట్ల అప్పుల పాలైందని, ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారని మోదీకి చెప్పానని, అయితే ఆయా విషయాలన్నీ అప్పటికే మోదీ దృష్టిలో ఉన్నాయన్నారు. ఆయా సమస్యల సాధనకు మినహా ప్రధాని మోదీతో ఎలాంటి రాజకీయాలు చర్చించలేదని, కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుపడుతున్నామంటూ టీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కోమటిరెడ్డి తోసిపుచ్చారు.

*చిత్రాలు.. ప్రధాని నరేంద్ర మోదీతో మంగళవారం ఢిల్లీలో భేటీ అయన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,
*పార్లమెంట్ సభ్యుల అల్పాహార విందులో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి