తెలంగాణ

బంద్ కరోనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: కరోనా నివారణకు తెలంగాణలో 24 గంటల పాటు స్వచ్ఛందంగా బంద్ పాటిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ఇచ్చారు. ప్రగతి భవన్‌లో శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు ప్రజలు ఎవరూ రోడ్లపైకి రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 14 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపును గుర్తు చేస్తూ, కరోనా నివారణలో మరో అడుగు ముందుకు వేస్తూ రాష్ట్రంలో 24 గంటల పాటు బంద్ పాటిద్దామని కేసీఆర్ ప్రజలకు సూచించారు. బంద్ పాటించడం వల్ల కరోనా వైరస్ విస్తరించదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో ఎవరికి వారు బాధ్యతగా మెలగాలని ఆయన కోరారు. కరోనా నివారణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం కావాలని సీఎం కోరారు. తెలంగాణ జాతి గొప్పదని, 60 సంవత్సరాల తర్వాత సొంత రాష్ట్రాన్ని తెచ్చుకున్నదని
కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సకల జనుల సమ్మె తదితర సందర్భాలలో పలు పర్యాయాలు బంద్ పాటించామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమ స్ఫూర్తితోనే కరోనా నివారణకు జరుగుతున్న ఉద్యమంలో కూడా ప్రజలు సహకరించాలని ఆయన అన్నివర్గాల ప్రజలను కోరారు. తెలంగాణ యావత్తూ, చీమ చిటుక్కుమన్నా వినిపించేలా బంద్ ప్రభావం ఉండాలన్నారు. ఆర్టీసీ బస్సులు నడవవని, డిపోలకే పరిమితం అవుతాయన్నారు. ఐతే ప్రతి డిపోలో ఐదు బస్సులను సిద్ధంగా ఉంచుతామని, అత్యవసర పనుల కోసం వీటిని వాడతామన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే బస్సులను సరిహద్దుల్లోనే ఆపివేస్తామన్నారు. భారత రైల్వే ఇప్పటికే అన్ని రైళ్లను రద్దు చేసిందని గుర్తు చేస్తూ, హైదరాబాద్ మెట్రో రైళ్లు కూడా బంద్ అవుతాయని కేసీఆర్ తెలిపారు. అత్యవసర పనుల కోసం ఐదు మెట్రోరైళ్లను సిద్ధంగా ఉంచుతామని, ఇవి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధీనంలో ఉంటాయని, అవసరాన్ని బట్టి వీటిని వినియోగిస్తామన్నారు. ప్రైవేట్ వాహనాలు, ఆటోలు అన్నీ బంద్ చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా బంద్ అవుతాయని వివరించారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, మాల్స్ తదితర సంస్థలన్నీ స్వీయ నియంత్రణ పాటించి, మూసివేయాలని కేసీఆర్ కోరారు. 24 గంటల పాటు బంద్‌లో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, 24 గంటల పాటు బంద్ పాటించి బంద్ పాటించడం ద్వారా కరోనాను నివారించి సమాజాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని పిలుపు ఇచ్చారు.
మినహాయింపు
పాలు సరఫరా చేసేవారికి, వైద్య సేవలు అందించేందుకు, శాంతిభద్రతలు కాపాడే పోలీసులు, ప్రజలకు సమాచారం అందించే మీడియా ప్రతినిధులకు బంద్ వర్తించదని కేసీఆర్ పేర్కొన్నారు.

*చిత్రం... ప్రగతి భవన్‌లో శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్