S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

08/26/2019 - 22:39

ఆధునికాంధ్ర సాహిత్య లోకంలో క్రొత్తపాతల మేలుకలయికతో క్రొమ్మెఱుంగులను చిమ్మిన రచయితలలో ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీగారు ఒకరు. కథా-కవితా-విమర్శల ముక్కంటి శ్రీ హనుమదింద్రగంటి. సుమారుగా 1980 ప్రాంతాలలో శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మగారి కోరికమేరకు ఆంధ్రజ్యోతి వారపత్రికకోసం శాస్ర్తీగారు ఈ ‘‘గౌతమీగాథల’’ను వెలువరించారు. సత్యం శంకరమంచిగారి ‘‘అమరావతి కథల’’ ప్రేరణతో ఇది రచింపబడింది.

08/19/2019 - 22:20

స్వరం ఖల్విదం బ్రహ్మ (మనకు కనిపించేదీ, కనిపించనిదీ, కదిలేదీ, కదిలించేది, కదలనిదీ -యావత్తూ-పరబ్రహ్మ స్వరూపమే)’’ అంటుంది ఛాందోగ్యోపనిషత్తు మూడవ అధ్యాయం 14వ ఖండంలోని ఒక ‘మహావాక్యం’. అంతటి విరాట్‌స్వరూపానికి బొమ్మ-బొరుసుల్లాగా సగుణాత్మక సారూప్యమూర్తులు శివకేశవులు. ఆ రెండు రూపాల వౌలిక తత్త్వానికి భేదం లేదు. ఇదే చెప్తుంది -
‘‘శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే!

08/11/2019 - 21:15

సాధారణంగా తెలుగువారి నూతన సంవత్సరం సందర్భంగా ఉగాది కవి ‘సమ్మేళనాలు’ జరుగుతుంటాయి. అందులో భారతీయతను గౌరవిస్తూ వసంత ఋతువును వర్ణిస్తూ తెలుగుదనాన్ని వివరిస్తూ కవిత్వం చెప్తారని ఆశించి ప్రేక్షకులు పూర్వం వచ్చేవారు. గత ఇరవై ఏళ్లనుండి ఆ కవి సమ్మేళనాల్లో నకారాత్మక దృక్పథంతో కూడిన కవిత్వానికి ప్రాధాన్యత పెరిగింది. ‘‘వసంతం వాడిపోయింది. కోయిల ఎగిరిపోయింది.

08/05/2019 - 22:44

గోరాశాస్ర్తి గా ప్రముఖులయిన గోవిందు రామశాస్ర్తీ (1917-1981) బతికి వుంటే ఇప్పటికి నూట రెండేళ్ళు. కానీ ఆయన తన 64వ ఏట దివంగతులయ్యారు. ఇంగ్లీషు, తెలుగు నుడికారాల మీద సమానమైన అధికారాన్ని సాధించిన ప్రజ్ఞాశీలి. నేటితరం, నిన్నటి తరం రచయితలెందరినో వెలుగులోకి తెచ్చిన స్మరణీయుడు.

07/28/2019 - 23:07

ఆయన కవిత్వ అనుభూతితో పరిచయం కలిగిన పుష్కర కాలానికి కానీ ఆయన పరిచయం కలగలేదు. ఆకాశవాణిలో ప్రసార నిర్వహణాధికారిగా వున్న నాకు పదోన్నతితో కార్యక్రమ నిర్వహణాధికారిగా విజయవాడ కేంద్రానికి బదిలీ కావడంతో, 1991లో ఉషశ్రీగారి స్థానంలో అక్కడ తెలుగు విభాగాన్ని నిర్వహించే బాధ్యతలు చేపట్టాను. అప్పటికి ఆయన విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో స్క్రిప్ట్‌రైటర్ పదవిలో వున్నారు.

07/22/2019 - 23:02

వదనం మధురం... వచనం మధురం
కవనం మధురం... గానం మధురం
- ఇలా చెప్పుకుంటూ పోతుంటే అవన్నీ ఓచోట ఆగిపోతాయి. అక్కడో దీపస్తంభం వెలుగులు చిమ్ముతూ కనిపిస్తుంది. ఆ దీప స్తంభానికి మువ్వలుంటాయి. అవి ‘‘దివ్వెల మువ్వలు’’. అవే సినారె కవితాక్షరాలు.

07/15/2019 - 22:15

కైవారము

‘‘తుండమున్నంతనే దోమ శుండా దండ
మండితోద్దండ వేదండ మగునె
ఎఱక లున్నంతనే ఈగ ఝంఝా సమీ
రోదగ్ర గండభేరుండ మగునె
కంఠమున్నంతనే కాకి పల్లవ శాఖి
కారూఢ పికరాజ్యకాంతుడగునె
గమనమున్నంతనే గాడిద రమ్య ధా
రామనోహర హయరాజమగునె

07/08/2019 - 21:53

తెలుగు ఆధునిక కవిత్వంలో దిగంబర కవిత్వం చూపిన ప్రభావం, ఇచ్చిన ప్రేరణ, కలిగించిన సంచలనం మరిచిపోలేనిది. దిగంబర కవిత్వం ఆరుగురితో ఉద్యమ కవిత్వంలా విస్తరించి తన ఉనికిని చాటుకొంది. దిగంబర కవితోద్యమంలో తీవ్ర సంచలనం రేపిన ప్రముఖ దిగంబర కవి మహాస్వప్న జన్మస్థలం ప్రకాశం జిల్లా లింగసముద్రం. ఈయన అసలు పేరు కమ్మిశెట్టి వెంటేశ్వరరావు.

07/01/2019 - 22:13

ఆనకట్టల విశ్వవిద్యాలయముల
మాట కొన్నాళ్ళు మంత్రులు మఱచిపొండు
కఱటి మద్య పిశాచి నీ గడ్డనుండి
పాఱద్రోలుడు పడతుల పరువు నిల్వ
- సందేశ సప్తశతి
*

06/24/2019 - 22:45

సాహిత్యంలో ఆత్మకథ అనే దానికి ఎందుకు అంత ప్రాధాన్యమిస్తారూ అంటే, ఏ వ్యక్తియైనా తన గురించి, తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి తానే స్వయంగా చెబుతాడు. అది కూడా అతని గుండె లోతుల్లో ఉండే జ్ఞాపకాల పొరల్లోనుంచి వస్తుంది కాబట్టి.

Pages