S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

09/16/2018 - 23:36

***గురజాడ రాసిన కన్యాశుల్కం ఆధునిక తెలుగు సాహిత్యంలోనేకాక, నాటక ప్రక్రియలోనూ పెనుమార్పులకు కారణం అయింది. ఈ నాటకం తెలుగు సాహిత్యంలో చెప్పలేనంత సంచలనాత్మకమైన విప్లవం తెచ్చింది. ఈ నాటకం మీద వచ్చినంత విమర్శ, ప్రతివిమర్శలు మరి ఏ నాటకం మీద, ఇతర గ్రంథం మీద కూడా రాలేదు. అంతేకాదు ఒక రచయిత రాసిన ఒక గ్రంథం మీద ఇన్ని వేల పేజీల విమర్శ కూడా రాలేదు. ఇది గొప్పేకాదు, ఒక రికార్డు కూడా.

09/10/2018 - 01:32

నాగసూరి వేణుగోపాల్!.. ఈ పేరు వింటే పాపులర్ సైన్స్ రచనలు, టి.వి. ముచ్చట్లు, ఛానళ్ళ హోరుపై విశే్లషణలు, పర్యావరణ సమస్యలపై చైతన్యపూరిత రచనలు గుర్తొస్తాయి. ఆకాశవాణిలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ నుండి తిరుపతి ఆకాశవాణి కేంద్రం స్టేషన్ డైరెక్టర్ స్థాయి వరకు అంచలంచెలుగా ఎదుగుతూ, ఒదుగుతూ...

09/02/2018 - 23:37

తన కాలంలోని సాహిత్యాన్ని ప్రజాపరం చేసిన ప్రజాకవి డా. అద్దేపల్లి. ఎందరో సమకాలీనులకు- కవిగా, విమర్శకునిగా, సమీక్షకునిగా సభా సంచలనాల్లో సాహితీయోధునిగా గణుతికెక్కారు. కవిత్వ ప్రాధాన్యతలలో ఎదుటివారి విలువలను సున్నితంగా, సుతిమెత్తగా విమర్శించే నైజం ప్రదర్శించే అరుదైన వారిలో అరుదైనవారు అద్దేపల్లి. ఒక రకంగా కవిత్వం వక్తృత్వంల మేలు కలయిక అద్దేపల్లిలో కన్పిస్తుంది.

08/26/2018 - 22:13

తెలుగులో మనకు హైకు, రుబారుూ, గజల్, సానెట్, లిమరిక్, ఏక పంక్తి, కత్‌అ, ఎపిటాఫ్ వంటి విదేశీ కవితా ప్రక్రియలు కనిపిస్తు న్నాయి. ఈ విదేశీ కవితా ప్రక్రియలలో హైకు దాదాపుగా ఒక విఫల ప్రక్రియ అయింది తెలుగులో. నిజానికి హైకు అందం, శిల్పం, గొప్ప తనం తెలుగుకు తెలియరాలేదు. తెలుగులో ఏకపంక్తి కవిత, గజల్, ప్రక్రి యలు చలామణిలో ఉన్నాయి. రుబాయి ఉంది అన్న స్థితిలో ఉంది.

08/20/2018 - 19:27

‘‘పాము కోర డేగ రెక్క ఈ కాలానికి చిహ్నం-
పూల తేనె నెమలి రెక్క ఒక మిథ్యా ప్రమాణం’’

08/12/2018 - 23:22

సిబియస్‌ఇ సిలబస్ ప్రకారం వివిధ పాఠ్యాంశాలను బోధిస్తున్నాం అని చెప్పుకునే స్కూళ్ళలోని ఒక రికగ్నైజ్డ్ స్కూలువారి ఒకటవ తరగతి తెలుగు వాచకం (Text Book)లో 5వ పుటలో ఒక రూపాయి నాణెం బొమ్మ పక్కన ‘బు’ అనే అక్షరంతో మొదలయ్యే పదమంటూ ‘బుక’ అని పేర్కొన్నారు. ఆ వాచక రచయిత్రి. వాచకం పేరు ‘ఆపిల్ తెలుగు భారతి- (1).

08/05/2018 - 22:53

ఈ ప్రశ్నద్వయాన్ని ఇంకాస్త సాగదీయాలంటే ఏది దుర్భావ స్వేచ్ఛ? ఏది విషభావ స్వేచ్ఛ? అని కూడా కలపవచ్చు. రచయితనని తాననుకొనే వ్యక్తికి, అధవా ఇతరులు అంటున్న వ్యక్తికి, సమాజానికి ఉద్వేగం కలిగించకూడదు! హాని తలపెట్టకూడదు! అనే ఇంగితం ఉండాలి. దానినే వివేకమంటారు. వివేకం లేకపోతే తనకేకాక, తన పరిధిలో ఉండే సమాజానికి హాని లేదా ప్రకోపం సంభవిస్తుంది.

07/30/2018 - 00:08

పర పీడనం మానేస్తే పుణ్యం వస్తుందనేది పెద్దల మాట. సమాజ జీవనంలో రుజువర్తనం అధిక సంఖ్యాకుల జీవన రీతి. కొందరు కథా నైపుణ్యాత్ములు, ప్రపంచ ప్రజలకు జంతువుల మీద కీటకాల మీద పెట్టి నడవడిక కథలు చెప్పారు. వారిలో ఆద్యుడు విష్ణుశర్మ మాస్టారు.

07/23/2018 - 02:44

మహాసముద్రంలో అలలు రావటం సాధారణమైన విషయం. కానీ రూపురేఖల్ని మార్చేసేవిధంగా, చరిత్రను కొత్త పుంతలు తొక్కించేవిధంగా పెనుకెరటాలు తీరాన్నితాకి పాతస్వరూపాన్ని పాతిపెట్టే విధంగా ఈడ్చి కొట్టటం అంటే అది ఒక నవయుగమే అవుతుంది. తెలుగు సాహిత్య చరిత్రలో కరడుగట్టిన బూర్జువాతత్వాన్ని తుదముట్టించేందుకు కలాన్ని కత్తిలా వాడి, చీల్చి చెండాడి రుద్రవీణను వాయించిన అగ్నిధారాస్వరూపం, సాహస విప్లవ మహోదధి, కళాప్రపూర్ణ డా.

07/16/2018 - 04:10

ఇటీవల తెలుగునాట ఒక గొప్ప పెద్ద నగరంలో పుస్తక ప్రదర్శనోత్సవాన్ని సందర్శించాను. చాలా విస్మయం, విడ్డూరం అనిపించిన విషయమేమంటే ఈ పుస్తక ప్రదర్శనా ఆవరణ ప్రాంగణంలో వివిధ పుస్తక విక్రయ అంగళ్ళలో పూర్తిగా ఒక అంగడి మొత్తానికి మొత్తం ఒకనాటి ఘనత వహించిన రచయిత గుడిపాటి వెంకట చలానికి కేటాయించి ఉంది. అంటే ఆ అంగడిలో ఇతర పుస్తకాలేవీ దొరకవన్నమాట. చలం పుస్తకాలే గంపగుత్తగా ప్రదర్శితమై ఉన్నాయి.

Pages