ఐడియా

పెళ్లి సమయంలో ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీకమాసం వచ్చేసింది. పెళ్లిళ్లు మొదలైపోయాయ. జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే అతి పెద్ద పండుగ పెళ్లి. అలాంటి సమయంలో ప్రతి ఒక్క అమ్మాయి అందంగా కనిపించాలని కోరుకుంటుంది. అలా పెళ్లిలో కనిపించాలంటే అప్పటికప్పుడు రెడీ అవుతే సరిపోదు. కనీసం నెలరోజుల ముందు నుంచీ శారీరికంగా, మానసికంగా సిద్ధమవ్వాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా చెయ్యాలి. ముఖానికి ఏ క్రీములు పడితే అవి వాడకూడదు. గుర్తింపు లేని బ్యూటీపార్లర్లకు వెళ్లి కొత్త రకాల ఫేషియల్స్ ట్రై చేయడం వంటి ప్రయోగాలు చేయకూడదు. ఈ సమయంలో ఆరోగ్యంగా, అందంగా కనిపించాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..
* ప్రతిరోజూ చిన్న చిన్న వ్యాయామాలతో పాటు యోగాను కూడా చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
* అది ఏ కాలమైనా నీటిని ఎక్కువగా తాగాలి. అప్పుడే శరీరం డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
* పనికి సంబంధించిన ఒత్తిడి దరిచేరకుండా చూసుకోవాలి. అలాగే పెళ్లి అనగానే ఏ అమ్మాయికైనా ఒత్తిడి ఉంటుంది. అలాంటి ఒత్తిడికి గురవకూడదు.
* పెళ్లి అనగానే బోలెడు పనులు ఉంటాయి. అవన్నీ చక్కబెట్టుకోవడానికి ఎండలో తిరగకూడదు. తిరిగితే చర్మం కమిలిపోయి, టాన్ పట్టేస్తుంది.
* పెళ్లి సమయంలో పనులను ప్రణాళిక వేసుకుని పనులను చక్కబెట్టుకోవాలి. షాపింగ్ వంటివి సాయంత్రం వేళల్లో చేసుకుంటే మంచిది. వీటన్నింటినీ పదిహేను రోజుల ముందే పూర్తిచేసుకోవడం మంచిది. ఇక పెళ్లి పిలుపులను ఇతరులకు అప్పజెప్పడం మంచిది.
* నెల ముందు నుంచీ పెళ్లి కూతురు సమయానికి నిద్రపోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. రాత్రిపూట త్వరగా నిద్రపోయి, ఉదయం త్వరగా మేల్కొనాలి. ఇలా చేయడం వల్ల అలసట దూరమవుతుంది. మానసికంగా చురుగ్గా ఉండొచ్చు. ఇలా కాకుండా రాత్రుళ్లు గంటల తరబడి ఫోన్లు, టీవీల ముందు కూర్చోవడం వల్ల నిద్ర సరిపోదు. దీనివల్ల ఒత్తిడి పెరిగిపోతుంది.
* పోషకాహారానికి ప్రాధాన్యమివ్వాలి. ఉదయం తప్పకుండా గ్రీన్ టీ తాగాలి. పండ్లరసాలు, పండ్ల ముక్కలను ఎక్కువగా తీసుకోవాలి. మసాలా పదార్థాలు, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆకలితో ఉండకుండా ఎండుఫలాలు, గింజలు వంటివి తింటూ ఉండాలి. జంక్‌ఫుడ్, శీతల పానీయాలు, రోడ్డు పక్కన ఆహారానికి, టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. వీటి ప్రభావం చర్మంపైన పడుతుంది.
* ప్రతికూల ఆలోచనలు దరిచేరకుండా ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలి.
* రెగ్యులర్‌గా వెళ్లే బ్యూటీపార్లర్లకే వెళ్లాలి. ఎప్పుడూ చేయించుకునే ఫేషియల్స్‌నే చేయించుకోవాలి. ఇవి కూడా అతిగా చేయించుకోకూడదు. ఇలా చేస్తే పెళ్లి సమయంలో అందంగా, ఆరోగ్యంగా ఉంటారు.