S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

09/09/2019 - 18:44

తీర్చిదిద్దినట్లుండే పెదవుల వల్ల ముఖానికి కొత్తందం వస్తుంది. పెదవులను లిప్‌స్టిక్‌తో తీర్చిదిద్దుకోవడంలో కొన్ని మెలకువలు పాటించాలి. లిప్‌స్టిక్ వాడేముందు తెలుసుకోవలసిన మొదటి విషయం అసలు పెదవులకు ఎటువంటి లిప్‌స్టిక్ నప్పుతుందో అని.. అందుకోసం దాన్ని పెదవులకే వేసుకోవలసిన అవసరం లేదు. దాన్ని వేళ్లపై కొద్దిగా రాసుకుని పరీక్షించుకోవచ్చు.

09/06/2019 - 18:40

మారుతున్న కాలానికి అనుగుణంగా మన చర్మానికి అదనపు జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా పొడి, జిడ్డు చర్మం గలవారు జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, శుభ్రంగా ఉంచుకోవాలి. చర్మానికి కావలసిన తేమను అందించే సహజ, సురక్షిత మార్గాలు చాలానే ఉన్నాయి. వీటిలో బీట్‌రూట్ కూడా ఒకటని చెప్పవచ్చు. బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బీట్‌రూట్ అభిరంజన గుణాన్ని కలిగి ఉంటుంది.

,
09/05/2019 - 19:24

బరువు తగ్గడానికి చాలామంది విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. తిండిమానేయడం, అర్ధరాత్రి వరకు నిద్రమానేయడం, ఒక్కరోజులోనే సన్నగైపోవాలని విపరీతమైన వర్కవుట్స్ చేయడం.. వంటి పనులన్నీ చేస్తుంటారు. ఇవన్నీ బరువు పెరగడానికి కారణాలు అవుతాయి. ముఖ్యంగా నిద్రలేమి సమస్య కూడా బరువును పెంచుతుంది తెలుసా! నిద్రలేమి సమస్య వల్ల ఆకలిని నియంత్రించే గ్రెలిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది.

08/30/2019 - 19:51

* అరగ్లాసు వేడిపాలలో రెండు మూడు చిటికెలు పసుపు, రెండు అల్లం ముక్కలు కలిపి తాగితే ఎలర్జీ తగ్గుతుంది.
* గోరువెచ్చని పాలలో మెత్తగా నూరిన మిరియాల పొడి కలిపి తాడితే జ్వరం తగ్గుతుంది.
* ముక్కులోంచి రక్తం కారడం తగ్గాలంటే ఉల్లిపాయను దంచి రసం తీసి మాడుకు రాసుకుని, వేడి పదార్థాలకు బదులు చదవ పదార్థాలు తింటే మంచిది.

08/29/2019 - 18:42

అమ్మాయిలకే కాదు అబ్బాయిలకూ అందంగా ఉండాలనే ఉంటుంది. అందం విషయంలో ఎవరైనా సరే అందరికన్నా కాస్త ఎక్కువగా ఉండాలని అందరిలో నిలబడినపుడు తననే ప్రత్యేకంగా చూడాలని అందరూ సహజంగా అనుకొంటారు.

08/27/2019 - 18:51

ఊబకాయంతో బాధపడుతున్న వారు, లావు తగ్గాలని కోరుకుంటున్న వారు రాత్రి సమయంలో అన్నం మానేయడం చాలా మంచి పద్ధతి. రాత్రి సమయంలో మనం నిద్రకే ప్రాధాన్యం ఇస్తాం. డాక్టర్లు కూడా ఈ మధ్య రాత్రి వేళ చపాతీలు తినమనే చెప్పటంతో ఎక్కువమంది దీనివైపే మొగ్గు చూపుతున్నారు. కాకపోతే చపాతీ తినేవాళ్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

08/27/2019 - 18:49

‘సంసారమే బృందావనం ఆనంద తీరాల నవ నందనం.’ అన్న మాటేమోగానీ చక్కని సంసారం ఉన్న ఇల్లు అనునిత్యం సౌభాగ్యంతో కళకళలాడుతూ వుంటుంది. సంసారం సాఫీగా సాగిపోవాలంటే ఇల్లాలు ఎంతో ఓర్పుతో, నేర్పుతో కుటుంబంతో సహకరించాలి. కొన్ని ఇళ్లలో ఉమ్మడి కుటుంబాలుంటాయి. మరికొన్ని ఇళ్లలో ఇద్దరే ఇద్దరుంటారు. భార్యాభర్తల బంధం అపురూపమైనటువంటి బంధం.

08/26/2019 - 19:52

వానాకాలంలో, చలికాలంలో ఎవరికీ నీళ్లు తాగాలనిపించదు. వేడివేడిగా కాఫీనో, టీనో తాగాలనిపిస్తుంది కానీ మంచినీళ్లు తాగరు. కానీ చలికాలంలో కూడా సరైన మోతాదులో మంచినీళ్లు తాగాలి. శరీరానికి తగినంత మంచినీరు అందకపోతే కడుపులో అంతా గందరగోళంగా ఉంటుంది. ఆహారం సరిగా అరగదు. ఈ సమయంలో ఒక గ్లాసు మంచినీళ్లు తాగితే తెలుస్తుంది.. అది ఆకలి వచ్చిన గందరగోళమో.. లేక శరీరానికి నీళ్లు అందక, డీహైడ్రేషన్ వచ్చిన గందరగోళమో అని..

08/22/2019 - 18:55

పులిపిరి కాయల సమస్య ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. వీటిని ఉలిపిరి కాయలు అని కూడా అంటారు. ఆంగ్లంలో వీటిని వార్ట్స్ అంటారు. హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వల్ల ఈ పులిపిరులు ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా ముఖం, మెడ, చేతులు, పాదాలపై వస్తుంటాయి. చర్మంతో కలిసిపోయే కొన్ని పులిపిర్లు పెద్దగా నొప్పిరావు. కొన్ని పులిపిర్లు మాత్రం దురద పెడుతుంటాయి.
రకాలు

08/21/2019 - 18:35

* ఆధునిక కాలంలో అధిక బరువుకు ఓట్స్ పరమ ఔషధంలా మారాయి. ఉదయం పూట పాలల్లో ఓట్స్ వేసుకుని తినడం వల్ల బరువు పెరగరు. అలాగే మిగతా ఆహారపదార్థాల్లో కూడా ఓట్స్ శాతాన్ని పెంచాలి.
* నిద లేచిన గంటలోపలే అల్పాహారాన్ని తినాలి.
* చికెన్, మాంసాలను తక్కువగా, చేపలను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది.
* వారానికి మూడుసార్లు తప్పనిసరిగా గుడ్డును తినాలి.

Pages