ఐడియా

నడుస్తున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి ఒక్కరూ రేపటి ఉదయం నుంచి ఎలాగైనా వ్యాయామం చేయాలనుకుంటారు. కానీ చేయరు. ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసుకుంటామని చెబుతారు కానీ తీసుకోరు. ఇలా ప్రతిరోజూ వ్యాయామాలను వాయిదా వేస్తూ పోతే బరువు పెరిగిపోతారు. శరీరం కదలకుండా పోతుంది. పెళ్లికి ముందు ఫిట్‌గా ఉండే ప్రతి ఒక్కరూ పెళ్లయి పిల్లలు పుట్టాక ఉద్యోగం, పిల్లలు, ఆలస్యంగా పడుకోవడం, ఆహారనియమాలు పాటించకపోవడంతో లావయిపోతారు. ఫలితంగా ఆయాసం, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. కుటుంబం కోసం అంతసమయాన్ని కేటాయించే స్ర్తీలు తమకోసం కొద్ది సమయాన్ని కూడా కేటాయించుకోలేక, వ్యాయామాలు చేయలేక ఇబ్బందులు పడుతుంటారు. అలాకాకుండా ప్రతి ఒక్కరూ తమకోసం కేవలం అరగంట సమయాన్ని కేటాయించి నడకను ప్రారంభించినట్లయితే ఆరోగ్యాన్ని పొందడంతో పాటు ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు. కొంతమంది లావైపోయిన మహిళలు చేసే పొరపాటు ఏంటంటే.. బరువు త్వరగా తగ్గాలి అనుకుంటూ మొదటిరోజే తక్కువ ఆహారాన్ని తీసుకుంటూ విపరీతమైన వ్యాయామాలు చేసేస్తుంటారు. ఫలితంగా వారు రెండు రోజులకే నీరస పడిపోతారు. మరుసటి రోజు వ్యాయామానికి వెళ్లడానికి మనస్కరించదు. దీనితో పాటు ఒకేసారి తిండి తగ్గించడం వల్ల ఆకలి ఎక్కువై మనసు తిండి పైన ఎక్కువ మనసు మళ్లుతుంది. కాబట్టి ఆహారపదార్థాలను ఒకేసారి తగ్గించకుండా ముందుగా కొవ్వుపదార్థాలను తగ్గిస్తూ నెమ్మదిగా నెమ్మదిగా ఆహారాన్ని తగ్గించుకోవాలి. వ్యాయామాన్ని కూడా ఒకేరోజూ మొత్తం చేయకుండా కొద్దికొద్దిగా పెంచాలి.
* నడకైనా, వ్యాయామైనా, డైటింగ్ అయినా చాలా కష్టం అనుకోకుండా చాలా ఇష్టంగా చేయాలి.
* ఉదయపు నడక ఒకేసారి కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచేయకుండా.. మొదటి వారం రోజులు కొద్దిదూరం మాత మే నడవాలి. తరువాత తరువాత నెమ్మదిగా దూరాన్ని పెంచుతూ పోవాలి.
* మొదట నడక వేగంగా నడవకూడదు. నెమ్మదిగా నడవాలి. మధ్యలో నడక వేగాన్ని పెంచాలి. తరువాత మళ్లీ నెమ్మదిగా నడవాలి. ఇలా చేయడం వల్ల కాళ్ల నొప్పులు రావు.
* నడక ఒక్కటే వ్యాయామం కాదు. ఈత తరగతులకు వెళ్లడం, సైక్లింగ్ చేయడం, టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటివి ఆడొచ్చు. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మానసికంగాకూడా చలాకీగా ఉంటారు.
* ఆహార విషయాలకు వచ్చేసరికి బరువు తగ్గడానికి కడుపు మాడ్చుకోవాల్సిన పనిలేదు. మాంసకృత్తులూ, పిండిపదార్థాలు శరీరానికి అందాలి. పిండిపదార్థాలు అంటే అన్నం, బ్రె డ్ నుంచి అందేవి కాకుండా సంక్లిష్ట పిండిపదార్థాలను ఎంచుకునేలా చూసుకోవాలి. అంటే బ్రౌన్‌రైస్, తృణధాన్యాలు, ఓట్స్ వంటివన్నమాట. వీటిని కూడా అమితంగా తీసుకోకుండా మితంగా తీసుకోవాలి. వీటిల్లో పీచు అధికంగా ఉండి అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది.
* డైటింగ్ చేసేవాళ్లు మాంసాహారాన్ని దూరంగా పెట్టాల్సిన పనిలేదు. కాకపోతే మాంసాహారాన్ని తక్కువగా తింటే సరిపోతుంది. దానికి బదులుగా మీల్‌మేకర్, స్కిన్‌లెస్ చికెన్‌ను ఎంచుకోవచ్చు.
* స్వీట్స్, చాక్లెట్స్ బరువు పెరగడానికి కారణమవుతాయి. అందుకే మిఠాయిలను మాత్రం తక్కువగా తినాలి. బదులుగా తేనె, తాజాపండ్లూ, ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష వంటివి కూడా తినొచ్చు. వీటితో చేసిన స్వీట్లు కూడా ఆరోగ్యానికి మంచిదే.
* రెస్టారెంట్లు, రోడ్డు పక్కల ఆహారాన్ని పూర్తిగా దూరం పెట్టాలి. మంచినీళ్లను ఎక్కువగా తాగాలి. పండ్ల రసాలకు బదులు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. కీరదోస, క్యారెట్, బీట్రూట్, టోఫూతో సలాడ్లు చేసుకుని తినడం మంచిది. నూనె, ఉప్పు కూడా ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది.
* ప్రతిరోజూ అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. రాజ్మా, పెసలు, బఠాణీ, సెనగలూ, గుడ్లూ, సోయా, పల్లీలు.. వంటి తప్పకుండా భోజనంలో ఉండేలా చూసుకోవాలి. వీటిలోని మాంసకృత్తులూ శరీరానికి శక్తిని అందిస్తాయి.
* కాఫీ, టీలు తాగినా అందులో పంచదార వేసుకోకూడదు. ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా గ్రీన్ టీ తీసుకుంటే మంచిది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గడంలోనే కాదు.. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపిస్తాయి.
ఇలా నెమ్మదిగా ఆహార అలవాట్లు మార్చుకుంటే, వ్యాయామం చేస్తూ ఉంటే కొద్దిరోజుల్లోనే మీరు కోరుకున్న బరువును పొందటంతో పాటు ఒత్తిడి లేకుండా హుషారుగా, చలాకీగా ఉంటారు.