ఐడియా

రక్తహీనతకు దూరంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్తహీనత ప్రధానంగా ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ12 లోపం వల్ల ఎదురవుతుంది. ఆ పోషకాలను ఆహార రూపంలో అందుకోవాలంటే ఒకే తరహా ఆహారపదార్థాల నుంచి కాకుండా పోషకాలను కలిపి తీసుకోవాలి. ఇనుము ఒక్కటే కాకుండా ఇతర విటమిన్లు, మినరళ్లూ వంటివి శరీరానికి అందేలా చూసుకోవాలి. పప్పు్ధన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు... వంటివన్నీ తగినంతగా తీసుకోవాలి. వీటివల్ల శరీరానికి సమతులంగా పోషకాలు అందుతాయి. అప్పడు శరీరం బీ12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ వంటివాటిని సులువుగా స్వీకరించగలుగుతుంది. ముఖ్యంగా కౌమార దశలో ఇనుము పోషకం ఎక్కువగా అవసరం అవుతుంది. నెలసరి మొదలయినప్పటి నుంచీ దీని అవసరం రెట్టింపు ఉంటుంది. పైగా మన దేశంలో ఈ పోషకం వల్ల రక్తహీనతకు గురయ్యేవారే ఎక్కువ. అయితే ఇనుముని ఏ రూపంలో తీసుకున్నా కూడా దాన్ని శరీరం సులువుగా గ్రహించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సప్లిమెంట్ వేసుకున్నా, ఆహారమే తీసుకున్నా వెంటనే కాఫీలు, టీలు తాగకూడదు. ప్రాసెస్ చేసిన ఆహారం, పచ్చళ్లు వంటివాటికి దూరంగా ఉండాలి. లేదంటే వీటిల్లో ఉండే టానిన్ ఇనుమును శరీరం అందుకోకుండా అడ్డుపడుతుంది. అలాగే ఐరన్‌ని మాత్రల రూపంలో తీసుకునేవారు ఖాళీ కడుపుతో వేసుకోవాలి. దానివల్ల ఆ పోషకం త్వరగా అందుతుంది. లేదంటే పళ్లరసంతో తీసుకోవచ్చు. అదీ కుదరకపోతే టాబ్లెట్ వేసుకున్నాక విటమిన్ సి ఎక్కువగా లభించే జామ, బొప్పాయి, ఆరెంజ్ వంటి పండ్లను తీసుకోవాలి.