ఐడియా

ఫేషియల్స్ అందాన్ని పెంచుతాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందంగా కనబడటం వలన ఆత్మవిశ్వాసంతోపాటు, మనపై మనకున్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. అందాన్ని మెరుగుపరచడంలో బ్యూటీపార్లర్లు కూడా సహాయపడతాయి. బ్యూటీపార్లర్లలో ఫేషియల్స్ ద్వారా అందాన్ని పెంచుతాం అని చెబుతుంటారు బ్యూటీషియన్లు... అయితే ఫేషియల్ వల్ల లాభాలే కాదు, నష్టాలు కూడా ఉన్నాయి అని అందరూ తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఫేషియల్స్ వల్ల దుష్ప్రభావాలు కూడా కలవగవచ్చు. అవేంటో చూద్దాం..
* ఫేషియల్ వల్ల ఒక్కోసారి చర్మం ఎర్రగా మారుతుంది. కొన్ని రకాల కఠినమైన గాఢతలు గల రసాయనాలు ఫేషియల్‌గా వాడటం వల్ల ఇవి చేసేవారి చర్మరకానికి సరిపోకపోవడం వల్ల చర్మం ఎర్రగా మారుతుంది. ఇలాంటి ఇన్ఫ్లమేషన్‌ల వల్ల చర్మం వాపుకు గురవటం లేదా ఎర్రగా మారటం జరుగుతుంది. ఒక్కోసారి ఈ క్రీముల వల్ల కళ్లకు కూడా నష్టం కలుగుతుంది.
* బ్యూటీపార్లర్లలో ఉండే నిపుణులు బ్లాక్‌హెడ్‌లను, చర్మంలో ఉండే మలినాలను తొలగించుకోవడానికి పరికరాలను వాడతారు. వీటివల్ల చర్మంపై మచ్చలు ఏర్పడతాయి.
* అధిక గాఢత కలిగిన క్రీమ్స్, లోషన్లు, ఇతర ఉత్పత్తులలో రసాయన స్థాయిలు అధికంగా ఉండి ఫేషియల్ మసాజ్ చేయడం వల్ల కొన్నిసార్లు చర్మాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ రసాయనాలు డెర్మిస్ (అంతశ్చర్మం) ప్రమాదానికి గురవడం వల్ల చర్మం చికాకులకు, దురదలకు గురవుతుంది.
* మార్కెట్లో కొన్ని వందల రకాల ఫేషియల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రతి ఒక్కటీ ఒక్కో ఆవశ్యకతను కలిగి ఉంటాయి. చర్మాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. వాటి వాటి అవసరాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. చర్మాన్ని అనుసరించి ఫేషియల్‌ను చేస్తుంటారు అనుభవజ్ఞులైన బ్యూటీషియన్స్. కొందరు మాత్రం మెరుపుదనం కోసం చర్మతత్వాన్ని అనుసరించకుండా ఏ ఫేషియల్ పడితే దాన్ని చేసేస్తుంటారు. ఫలితంగా దురదలు, రాషెస్, వాపులు వస్తాయి.
* తరచుగా ఫేషియల్స్ చేయించుకోవడం వల్ల చర్మం తేమను కోల్పోయి పి.హెచ్.లో మార్పులు కలుగుతాయి. ఫలితంగా చర్మం పొడిగా మారుతుంది. ఫేషియల్స్ చేయించుకున్న మొదటి ఏడు రోజులు చర్మం నిగారింపుగా కనిపిస్తుంది కానీ పోనుపోను ముఖం కళావిహీనంగా మారుతుంది. కాబట్టి ఫేషియల్స్ చేయించుకునే ముందు చర్మతత్వానికి అనుగుణంగా, సరైన నిపుణులను ఎంచుకుని చేయించుకుంటే మంచిది.