ఐడియా

మెరిసే చర్మం కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారుతున్న కాలానికి అనుగుణంగా మన చర్మానికి అదనపు జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా పొడి, జిడ్డు చర్మం గలవారు జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, శుభ్రంగా ఉంచుకోవాలి. చర్మానికి కావలసిన తేమను అందించే సహజ, సురక్షిత మార్గాలు చాలానే ఉన్నాయి. వీటిలో బీట్‌రూట్ కూడా ఒకటని చెప్పవచ్చు. బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బీట్‌రూట్ అభిరంజన గుణాన్ని కలిగి ఉంటుంది. దీనిని తాకిన వెంటనే మనల్ని అతుక్కుంటుంది. దీని రసంలో ఉండే విటమిన్ ఎ, ఫోలిక్ ఆసిడ్ కారణంగా చర్మానికి అతుక్కునే గుణాన్ని కలిగి ఉంటుంది. బీట్‌రూట్ సాధారణ చర్మ సంరక్షణకు ఉపయోగించే ఔషధంగా చెప్పవచ్చు. అలాంటిదే బీట్‌రూట్ ఫేస్‌ప్యాక్. అద్భుతమైన బీట్‌రూట్ ఫేస్‌ప్యాక్ తయారీకోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దీని తయారీకి బీట్‌రూట్, చిటికెడు పసుపు, సగం చెంచా పాలక్రీము, రెండు చెంచాల శనగపిండి సరిపోతుంది.
* ఈ ఫేస్‌ప్యాక్ తయారీలో ముందుగా సగం బీట్‌రూట్‌ను తీసుకుని ముక్కలుగా తరిగి గ్రైండ్ చేయాలి. దీనిని వడగట్టి రసాన్ని వేరుచేయాలి. తరువాత ఈ రసానికి చెంచా పసుపు, రెండు చెంచాల శనగపిండిని కలపాలి. తరువాత దీనిలో పాలక్రీమును కూడా వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి.
* ముఖాన్ని నీటితో శుభ్రంగా కడగాలి. తరువాత ముఖానికి, మెడకు ఫేస్‌ప్యాక్‌లను మందంగా అప్లై చేయాలి. కంటి ప్రాంతంలో చాలా జాగ్రత్తగా పూయాలి. పది, పదిహేను నిముషాల తర్వాత నీటితో కడిగేయాలి. కేవలం నీటితోనే దీనిని శుభ్రం చేయాలి. సబ్బులను ఉపయోగించకూడదు.