S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

07/23/2019 - 19:02

వాతావరణం మారింది. వర్షాలు పడుతునానయ. ఇలా వాతావరణ మార్పులతో పిల్లల్లో వైరల్ ఇన్‌ఫెక్షన్లు, గొంతునొప్పి, జలుబుతో ముక్కులు కారడం మొదలైపోయాయి. జలుబు, ముక్కు కారణం, ముక్కు బ్లాక్ అవ్వడం వంటివి పిల్లల్లో తరచూ చూస్తుంటాం. సీజన్ మారినప్పుడల్లా ఇవి వస్తూ ఉంటాయి. జలుబు పిల్లలను ఆడుకోనివ్వకుండా, అలసిపోయేలా చేస్తుంది. జలుబుకు మందులకంటే సహజ పద్ధతులను అనుసరించడం ద్వారా వారికి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

07/22/2019 - 18:05

సాక్షాత్పార్వతీ రుధిరాంశతో
జన్మించిన పుత్రిక గోరింట
గౌరింట ఇంటి పంటంట దీని పేరె గోరింట
ఆషాడమాసపు వలపుల పంట గోరింట
గౌరీ పార్వతుల ప్రేమకు పండిన సాక్ష్యం గోరింట
నూతన వధూవరులను ప్రేమ
మరింత పండించె గోరింట
గోరింట పోటీలో ఓడినోళ్లు గెలుస్తారు
అదేమి చిత్రమో.. రెండింతల ప్రేమకు పాత్రులు వాళ్ళు
ఆరోగ్యం, సౌభాగ్యం ప్రేమకు చిహ్నం గోరింట

07/17/2019 - 18:31

అందానికి అర్థం చెప్పాలంటే పదాలు వెతుక్కోకుండా ఐశ్వర్యారాయ్ అని చెబితే సరిపోతుంది. అంతగా తన అందంతో అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. 45 సంవత్సరాలు వచ్చినా కూడా ఏమాత్రం వనె్న తగ్గలేదు. బ్రహ్మదేవుడు ఈమెకు మాత్రమే అందాన్ని దాచుకునే యంత్రం ఏదో ఇచ్చినట్లున్నాడు. అందుకే ఇప్పటికీ గ్లామర్‌తో అందరి మతులూ పోగొడుతోంది. కుర్ర హీరోయిన్లు కూడా కళ్లు తిరిగిపోయేలా, కుళ్లు తెప్పించేలా ఉన్నాయి ఆమె అందాలు.

07/16/2019 - 18:27

అమ్మతనం ప్రతి మహిళ జీవితంలో అనిర్వచనీయమైన అనుభూతి. కాన్పు తరువాత పసికందు బాధ్యతలు, అధిక బరువు తల్లులను కొంత వరకు భావోద్వేగానికి గురిచేస్తాయి. అయితే ఆహార నియమాలతో పాటు తేలికైన వ్యాయామాలు చేయడం ద్వారా మునుపటి శరీరాకృతిలోకి మారవచ్చంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. వారు చెప్పిన చిట్కాలేంటంటే..

07/09/2019 - 18:21

నేటి కాలుష్య జీవనంలో కంటికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కళ్ల విషయంలో జాగ్రత్తగా లేకుంటే అవి పొడిబారి దురద, మంటతో పాటు కళ్ల కింద నల్లటి చారలు ఏర్పడతాయి. వివిధ రకాల అలర్జీల నుంచి కళ్లను కాపాడుకోవాలంటే డైట్ పాటించాలని చెబుతున్నారు ఢిల్లీకి చెందిన ప్రసిద్ధ నేత్ర వైద్యులు మినాల్ కౌర్. అవేంటో కూడా ఆయన వివరించారు.

07/04/2019 - 19:45

వగరు, తీపి, పులుపు మేళవింపు రుచులతో ఉండే అల్లనేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ఆరోగ్యానికి అమృతం వంటిది. పండును బాగా కడిగి, శుభ్రంచేసి రోజుకో మూడు, నాలుగు తినాలి. ఈ పండ్లతో ముఖ్యంగా మధుమేహం అదుపులోకి వస్తుంది.
వివిధ ప్రాంతాల్లో దీనిని దేవతాఫలంగా భావిస్తారు. ఆయుర్వేదంలో ఈ పండును అపర సంజీవనిగా పిలుస్తారు. ఈ పండులో విటమన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి.

07/03/2019 - 18:46

అందాన్ని మెరుగుపరుచుకోవడానికి వాడే సౌందర్య లేపనాలు, సంప్రదాయ పద్ధతులు వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నవేనని చరిత్ర చెబుతోంది. ఈతరం వారు వాడుతున్న సౌందర్య లేపనాలు అంటే కాస్మొటిక్స్ మన పూర్వీకులు వాడినవే అని అందరికీ తెలియని విషయం. కానీ ఇప్పటికీ ఆ సౌందర్య చిట్కాలను నిపుణులు కొనసాగిస్తున్నారు. అవేంటో చూద్దామా..

07/02/2019 - 19:09

ముఖం ఎంత అందంగా ఉన్నా ‘డబుల్ చిన్’ అంటే మాత్రం ఆ వదనంలో ముగ్ధత్వం కనిపించదు. అందుకే ఎంత అందంగా ఉన్నవారు కూడా కాస్త డబుల్ చిన్ కనిపించగానే దీని నుంచి ఎలా బయటపడాలా? అని ఆలోచిస్తుంటారు. కొందరికి డబుల్ చిన్ వయసు వల్ల వస్తే.. మరికొందరికి జన్యుపరంగా సంక్రమిస్తుంది. అయితే డబుల్ చిన్‌ను తగ్గించే కొన్ని టిప్స్ ఉన్నాయి.

06/28/2019 - 19:39

నేడు మనం చేసే పొదుపే.. భవిష్యత్తులో మన ఆర్థిక స్థిరత్వాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి మహిళలు కెరీర్ మొదలుపెట్టినప్పుడే పొదుపు చేయడం అలవాటు చేసుకోవడం మంచిది.
* ముందుగానే ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. అంటే ఖర్చులను ముందుగానే రాసుకుని దాని ప్రకారం అమలుచేయాలి.

06/21/2019 - 19:02

మహిళలు తెలియని చోటుకి వెళ్లినప్పుడు కాస్తంత ముందుచూపు, అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం. ఒక్కోసారి ఆపద ఎదురైనప్పుడు ఫోన్ చేసే సమయం కూడా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు సేఫ్‌లెట్ పరికరం అందుబాటులో ఉంటే చాలు. చూడటానికి బ్రేస్‌లెట్‌లా కనిపించే ఈ పరికరాన్ని చేతికి పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత ఫోన్‌లో సేఫ్‌లెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో స్నేహితులు, పోలీసుల ఫోన్‌నంబర్లను నమోదు చేసుకోవాలి.

Pages