ఐడియా

బాలింత బరువు తగ్గాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మతనం ప్రతి మహిళ జీవితంలో అనిర్వచనీయమైన అనుభూతి. కాన్పు తరువాత పసికందు బాధ్యతలు, అధిక బరువు తల్లులను కొంత వరకు భావోద్వేగానికి గురిచేస్తాయి. అయితే ఆహార నియమాలతో పాటు తేలికైన వ్యాయామాలు చేయడం ద్వారా మునుపటి శరీరాకృతిలోకి మారవచ్చంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. వారు చెప్పిన చిట్కాలేంటంటే..
* వేగంగా బరువు తగ్గాలనే ఆలోచనతో మొత్తానికే కేలరీలను తగ్గించడం సరికాదు. అయితే మీరు రోజూ తినే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉంటున్నాయో గమనించడం ముఖ్యం. బరువు తగ్గేందుకు మాంసకృత్తులు, కొవ్వులు, ప్రొటీన్లు వంటి సూక్ష్మ పోషకాలను సరిపడా తీసుకోవాలి. కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం మితంగా తినాలి.
* కాన్పు తరువాత బరువు తగ్గాలనుకునే మహిళలు పోషకాహారం తినడం ఎంతో ముఖ్యం. అన్నంతో పాటు పండ్లు, కూరగాయలు, మాంసం, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తుల్ని డైట్‌లో భాగం చేసుకోవాలి. పీచు పదార్థాలున్న ఆహారపదార్థాలను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. దాంతో జీర్ణ సంబంధ సమస్యలు దరిచేరవు.
* శరీరంలో నీరు తగ్గిపోకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. రోజులో మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి. దీంతో శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. జీవక్రియలు మెరుగవుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
* కాన్పు తరువాత మహిళలు చాలినంత నిద్ర పోయేందుకు అవకాశం తక్కువ. అయితే వీరికి కంటినిండా నిద్ర ఉండడం ఎంతో ముఖ్యం. నిద్ర చాలకపోతే మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. దీంతో బరువు పెరిగేందుకు ఆస్కారముంది.
* బరువు తగ్గేందుకు సరైన ఆహారంతో పాటు వ్యాయామమూ అవసరమే. ఇంట్లోనే తేలికపాటి ఎక్సర్‌సైజులు చేయడం మంచిది. మొదట్లో చిన్న చిన్న బరువులు ఎత్తాలి. రెసిస్టన్స్ బ్యాండ్స్‌తో వర్కవుట్ చేయాలి. రోజు గంటపాటు వ్యాయామాలు చేయడం వల్ల క్రమంగా బరువు తగ్గుతారు. అయితే ఒకేసారి వ్యాయామం కష్టంగా అనిపిస్తే రోజులోని గంట సమయాన్ని మూడుసార్లు విభజించుకుని చేస్తే మంచిది.
* యోగా వల్ల శరీరానికే కాదు, మనసుకూ వ్యాయామం లభిస్తుంది. యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది. శ్వాసపై ధ్యాస పెరుగుతుంది. మెదడుకూ విశ్రాంతి దొరుకుతుంది.