ఐడియా

జలుబును తగ్గించే చిట్కాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాతావరణం మారింది. వర్షాలు పడుతునానయ. ఇలా వాతావరణ మార్పులతో పిల్లల్లో వైరల్ ఇన్‌ఫెక్షన్లు, గొంతునొప్పి, జలుబుతో ముక్కులు కారడం మొదలైపోయాయి. జలుబు, ముక్కు కారణం, ముక్కు బ్లాక్ అవ్వడం వంటివి పిల్లల్లో తరచూ చూస్తుంటాం. సీజన్ మారినప్పుడల్లా ఇవి వస్తూ ఉంటాయి. జలుబు పిల్లలను ఆడుకోనివ్వకుండా, అలసిపోయేలా చేస్తుంది. జలుబుకు మందులకంటే సహజ పద్ధతులను అనుసరించడం ద్వారా వారికి త్వరగా ఉపశమనం లభిస్తుంది. పిల్లలకు ముక్కు బ్లాక్ అయి ఊపిరి అందనప్పుడు వారు పడే ఇబ్బందిని మనం చూడలేం. అలాంటప్పుడు కొన్ని సహజ పద్ధతులను, ఔషధాలను ఉపయోగించి పిల్లలకు ఎలా ఉపశమనం కలిగించాలో చూద్దాం..
* జలుబు ఎక్కువగా అనిపించినప్పుడు వామాకు నలిపి అందులో కొద్దిగా కర్పూరం కలిపి వాసన చూపించాలి. ఇలా చేయడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గి శ్వాస బాగా ఆడుతుంది.
* నీటిని బాగా మరిగించి అందులో కాస్త కర్పూరం, పసుపు వేసి ఆవిరి పట్టించాలి. శ్వాస బాగా ఆడుతుంది. ఇవి కాకుండా విక్స్ వేసుకుని కూడా ఆవిరి పట్టవచ్చు.
* జలుబు పిల్లలకు చికాకును కలిగిస్తూ త్వరగా అలసిపోయేలా చేస్తుంది. అందుకే ఈ సమయంలో వారు ఎక్కువ విశ్రాంతి తీసుకునేలా చూడాలి.
* వెచ్చని తేమతో కూడిన గాలిని పీల్చడం వల్ల పిల్లలు జలుబు నుండి త్వరగా ఉపశమనాన్ని పొందుతారు. పిల్లల గదిలో తేమభరిత వాతావరణం అధికంగా ఉండేలా చూడాలి.
* వేడిపాలల్లో పసుపు కొమ్ములతో తయారుచేసుకున్న పసుపు కానీ, పచ్చి పసుపుకానీ చిటికెడు వేసి పిల్లలకు తాగిస్తే జలుబు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
* కొంతమంది పిల్లలకు మిరియాల పాలు కూడా ఇస్తుంటారు. ఇది కూడా మంచిదే. కానీ పిల్లల అలవాట్లను అనుసరించి మిరియాల పొడి ఇవ్వచ్చా లేదా అనేది చూసుకుంటే మంచిది.
* అలాగే వేడినీటిలో పసుపు వేసి ఆ ఆవిరి పట్టిస్తే పిల్లలకు ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలుగుతుంది.
* పిల్లలు ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ వయసువారైతే వారికి వేడివేడి ద్రవపదార్థాలను పట్టించడం ద్వారా జలుబు, గొంతునొప్పి నుండి ఉపశమనం లభించడంతో పాటు శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కూడా ఉంటుంది.
* పిల్లల వయసు ఎక్కువగా ఉంటే సలైన్ డ్రాప్స్ ద్వారా ముక్కును శుభ్రం చేయవచ్చు. ఇలా చేస్తే కూడా ముక్కు దిబ్బడ వెంటనే తగ్గిపోతుంది.