ఐడియా

అందాలభామ చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందానికి అర్థం చెప్పాలంటే పదాలు వెతుక్కోకుండా ఐశ్వర్యారాయ్ అని చెబితే సరిపోతుంది. అంతగా తన అందంతో అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. 45 సంవత్సరాలు వచ్చినా కూడా ఏమాత్రం వనె్న తగ్గలేదు. బ్రహ్మదేవుడు ఈమెకు మాత్రమే అందాన్ని దాచుకునే యంత్రం ఏదో ఇచ్చినట్లున్నాడు. అందుకే ఇప్పటికీ గ్లామర్‌తో అందరి మతులూ పోగొడుతోంది. కుర్ర హీరోయిన్లు కూడా కళ్లు తిరిగిపోయేలా, కుళ్లు తెప్పించేలా ఉన్నాయి ఆమె అందాలు. అలాంటి అందగత్తె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అందాల వెనుక ఉన్న చిట్కాలను అందరితో పంచుకుంది. మనం కూడా అవేంటో చూసేద్దామా..
* మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. దీనివల్ల చర్మం తాజాగా మెరుపులీనుతూ ఉంటుంది. చర్మం ఎప్పుడూ ఎండిపోయి, నిర్జలీకరణం అయినట్లుగా ఉండకూడదు. ఇలా ఉంటే అందవిహీనంగా కనిపిస్తారు. కాబట్టి మంచినీటిని ఎక్కువగా తాగాలి. ఇలా నీటిని తాగడం వల్ల శరీరంలోని మలినాలన్నీ తొలగిపోయి చర్మం అందంగా, తాజాగా ఉంటుంది.
* ఐశ్వర్యారాయ్ ఎప్పుడూ కెమికల్ ఫేస్‌ప్యాక్‌లు కానీ, బ్యూటీపార్లర్ ప్యాక్‌లు కానీ వేసుకోదు. ఇంట్లో తయారుచేసిన సెనగపిండి ఫేస్‌ప్యాక్‌ను మాత్రమే వాడుతుంది. సెనగపిండిలో కొద్దిగా పసుపు, పాలను ఉండలు లేకుండా బాగా కలిపి ముఖానికి వేసుకోవాలి. పదిహేను నిముషాల తరువాత గుండ్రంగా రుద్దుతూ ముఖం కడిగేసుకోవాలి. చర్మానికి మాయిశ్చరైజర్ అందాలంటే ఈ ప్యాక్‌లో పాల బదులు పెరుగు వేసుకోవచ్చు. అప్పుడప్పుడూ ముఖానికి కీరా ఫేస్‌ప్యాక్ వేస్తే తాజాదనం మరింత పెరగుతుంది.
* అలాగే తిండి విషయంలో కూడా ఐశ్వర్యారాయ్ నియమాలను పాటిస్తుంది. తన ఆహారంలో కచ్చితంగా అన్ని పోషకాలు, విటమిన్లు, మాంసకృత్తులు ఉండేలా చూసుకుంటుంది ఈమె. అంటే పూర్తి బాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటుంది. మూడు పూటలా భోజనం కాకుండా చిన్న చిన్న భోజనాలను రోజు మొత్తంలో తీసుకుంటూ ఉంటుంది. దీనివల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు చేరకుండా ఉంటాయి.
* ఐశ్వర్యారాయ్‌కు జిమ్ చేయడం ఇష్టం ఉండదట. అందుకని దాని జోలికి వెళ్లదు. ప్రతిరోజూ ఉదయం బ్రిస్క్ వాక్, పవర్ యోగా వంటివి చేయడం వల్ల శరీరం ఫిట్‌గా, అందంగా ఉంటుంది. కొద్దిపాటి వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం శరీరాన్ని అందంగా, తాజాగా అని తాను నమ్ముతానంటోంది ఐశ్వర్యారాయ్.
తెలుసుకున్నారు కదా ఐశ్వర్యారాయ్ అందానికి చిట్కాలు.. ఇంకెందుకాలస్యం వెంటనే మీమీ ప్రయత్నాలను మొదలుపెట్టండి మరి!