S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

03/27/2019 - 19:25

టీనేజీ అమ్మాయిలు గోళ్ల అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. నెయిల్ పాలిష్‌ని ఉపయోగించడంలో మెలకువలు తెలుసుకోగలిగితే మరింత చక్కగా వాటిని ఉపయోగించుకోవచ్చు. అదెలాగంటే..
* కొందరు గోళ్లరంగు వేసుకుంటే అది చర్మంపైన కూడా అంటుకుంటుంది. అలాంటప్పుడు వాడేసిన లిప్‌బ్రష్‌ను నెయిల్ పాలిష్ రిమూవర్‌లో ముంచి రంగుపై అద్దితే సరిపోతుంది.

03/26/2019 - 19:07

వేసవికాలం వచ్చేసింది. వేడి, ఉక్కపోతలు పెరిగాయి. ఈ ఎండలో ఎక్కువసమయం నిలబడటం వల్ల చర్మం కందిపోతుంది. సూర్యరశ్మికి బహిర్గతమైన సమయంలో అతినీలలోహిత కిరణాల వల్ల చర్మం కణాలు ప్రమాదానికి గురవకుండా ఉండటానికి మెలనిన్ ఉత్పత్తి అధికం అవుతుంది. మెలనిన్ అనేది ఒక వర్ణద్రవ్యం. ఇది చర్మ, వెంట్రుకల, కంటి రంగు నిలిపి ఉంచేలా చేస్తుంది. ఒక నిర్దిష్ట సమయంలో మెలనిన్ సరిపోయేంత స్థాయిలో వేగంగా ఉత్పత్తి జరగదు.

03/22/2019 - 21:41

* సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, స్థూలకాయం, ఒత్తిడి.. ఇలా కారణాలు ఏవైనా కావచ్చు... నేడు చాలామంది గ్యాస్, అసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని తగ్గించుకోవడానికి ఏవేవో మందులను వాడుతుంటారు. ఈ మాత్రలు తీసుకోవడంవలన సమస్యలు తగ్గినా... సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కొందరు చెబుతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే కింద పేర్కొన్న కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటించాలి.

03/18/2019 - 19:53

కొన్ని రకాల వంట నూనెలు, పొద్దుతిరుగుడు, గుడ్డులోని పచ్చ సొన, ఆకుకూరల్లో, తృణధాన్యాల్లో ఎక్కువగా ఉండే విటమిన్ ‘ఇ’వల్ల ఆరోగ్యానికెంతో మేలని పోషకాహార నిపుణులు అంటున్నారు.

03/17/2019 - 22:53

ద ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల కళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
ద బేబీ ఆయిల్‌ని కళ్ల చుట్టూ సున్నితంగా మసాజ్ చేస్తే ఒత్తిడి తగ్గి రిలీఫ్ లభిస్తుంది.
ద కీరాని ముక్కలుగా కోసం రుబ్బి రసం తీయాలి. దాంట్లో కొద్దిగా రోజ్‌వాటర్‌ని కలిపి కళ్ల చుట్టూ పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోవాలి.

03/15/2019 - 18:47

మొటిమలు, బ్లాక్‌హెడ్స్, చర్మం కందిపోవడం, రంగు తేలిపోవడం, వయసు పైబడడం, చర్మ సమస్య ఏదైనా సులువుగా పరిష్కరించే అద్భుత జలం కొబ్బరి నీళ్లు.. మీరు వినింది కరెక్టే. కొబ్బరి నీళ్లు దాహాన్ని ఆరోగ్యాన్నివ్వడమే కాదు.. అందాన్ని కూడా ఇస్తాయి. కొబ్బరి నీళ్ళలో ఉండే విటమిన్ బి, విటమిన్ సి, ఇతరత్రా అనేక ఔషధ గుణాలు చర్మ సమస్యలను పరిష్కరించడానికి దివ్యౌషధమే అనుకోండి.

03/14/2019 - 18:33

గర్భంతో ఉన్న సమయంలో రోజువారీ కేలరీల కంటే 300 నుంచి 400 కేలరీలను ఎక్కువగా తీసుకోవాలి. ముందు నుండీ అంటే గర్భంతో ఉందని తెలిసినప్పటి నుంచీ ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకునేలా ప్రణాళికను రూపొందించుకోవాలి. కేవలం రూపొందించుకోవడమే కాదు.. ముందు నుండీ ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల గర్భస్థ సమయంలో వచ్చే ఇబ్బందులను సులభంగా ఎదుర్కోవచ్చు.

03/13/2019 - 20:11

ఇతర కాలాలతో పోలిస్తే శీతాకాలంలో చుండ్రు బెడద ఎక్కువగా ఉంటుంది. వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, వంశపారంపర్యత వంటి కారణాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలు. ఎక్కువ సమయం ఏసీలో ఉండటం, రోజంతా ఫ్యాన్ గాలికి కూర్చోవటం, తలస్నానం సమసయ్లో వాడిన షాంపూ పూర్తిగా పోకుండా మాడుకు అంటుకునే ఉండటం, పోషకాహార లోపం, హార్మోన్ల సమస్యల మూలంగానూ ఈ సమస్య రావచ్చు.

03/12/2019 - 18:26

నేటి తరం పదేళ్లయినా నిండకుండానే ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచేస్తోంది. వీరి నైపుణ్యం చూసి అబ్బురపోతూ.. మా పిల్లలు చాలా ‘స్మార్ట్’ అంటూ మురిసిపోతున్నారు తల్లిదండ్రులు. ఇలా అతిగా గాడ్జెట్స్‌కు అలవాటు పడితే ఇబ్బందులేంటో తెలుసా.. పిల్లలకి సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సంగతి అలా ఉంచితే ఎప్పటి కప్పుడు చేస్తున్న సర్వేలు మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నాయి.

03/11/2019 - 19:44

ఆస్తమా వ్యాధి వచ్చినవారికి ఊపిరితిత్తుల్లో గాలిప్రవాహంలో అడ్డంకులు ఏర్పడుతుంటాయి. దీంతో దగ్గు, గురక వంటి సమస్యలు వస్తుంటాయి. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ చిట్కాలను పాటిస్తే ఆస్తమా వ్యాధి నుండి సమర్థవంతంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Pages