ఐడియా
చిట్కాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కొన్ని రకాల వంట నూనెలు, పొద్దుతిరుగుడు, గుడ్డులోని పచ్చ సొన, ఆకుకూరల్లో, తృణధాన్యాల్లో ఎక్కువగా ఉండే విటమిన్ ‘ఇ’వల్ల ఆరోగ్యానికెంతో మేలని పోషకాహార నిపుణులు అంటున్నారు.
విటమిన్ ‘ఇ’శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలోని కణాలను ఆరోగ్యంగా పనిచేసేలా చేస్తుంది. ‘ఇ’విటమిన్ ఉన్న పదార్థాలను తరచూ తీసుకోవడంవల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. హానికారక క్రిములు, క్యాన్సర్ కణాల బారిన పడకుండా రక్షిస్తుంది.
శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగించి శరీరాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది. ముడతలు, చర్మం పొడిబారడంలాంటి సమస్యలు అదుపులోకి వస్తాయి.
చూపు మందగించడం, అల్జీమర్స్ లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ‘ఇ’విటమిన్‌ని ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ ‘ఇ’ని ఆహారంలో చేర్చుకోవడంవల్ల గుండెపోటుతోపాటు హృద్రోగ సమస్యలు దూరమవుతాయి. అధిక బరువూ తగ్గుతుంది.
ఒత్తిడి తట్టుకునేందుకు ‘ఇ’విటమిన్ ఎంతో ఉపయోగపడుతుంది.
‘’విటమిన్ ఉన్న పదార్థాలు తీసుకోవడంవల్ల మెటబాలిజమ్ సమస్యలు, మధుమేహ సమస్యలు దగ్గరకి రావు.
***