ఐడియా

గర్భిణుల ఆహారం ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గర్భంతో ఉన్న సమయంలో రోజువారీ కేలరీల కంటే 300 నుంచి 400 కేలరీలను ఎక్కువగా తీసుకోవాలి. ముందు నుండీ అంటే గర్భంతో ఉందని తెలిసినప్పటి నుంచీ ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకునేలా ప్రణాళికను రూపొందించుకోవాలి. కేవలం రూపొందించుకోవడమే కాదు.. ముందు నుండీ ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల గర్భస్థ సమయంలో వచ్చే ఇబ్బందులను సులభంగా ఎదుర్కోవచ్చు. తయారు చేసుకున్న ప్రణాళికలో కావలసిన పోషకాలను సరైన మోతాదులో ఉండేలా చూసుకుని తగిన సమయంలో ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి.
గర్భంతో ఉన్నవారు తమ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా కడుపులో పెరుగుతున్న పిండం యొక్క ఆరోగ్యం, పిండం పెరుగుదలకు కావలసిన ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారాన్ని సరిగా తీసుకోకపోతే, పిండం పెరుగుదలలో లోపాలతో పాటు పిండం తక్కువ రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది. ఆహార ప్రణాళికతో పాటు శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. అలాగే ఆరోగ్యాన్ని చెక్ చేయించుకునే వైద్యుడితో శరీరానికి అనుగుణంగా ఆహార ప్రణాలికను తయారుచేసుకుని వాటిని అనుసరిస్తూ, వైద్యుడి సలహాలను పాటించడం చాలా మంచిది
తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా కాల్షియం, ప్రొటీన్స్, ఐరన్, విటమిన్ సి, ఫోలేట్ వంటి అవసరమైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఆడవారు మామూలుగా తీసుకునే దానికంటే గర్భంతో ఉన్న సమయంలో ఎక్కువ కేలరీలను తీసుకోవాలని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వైద్యులు తెలిపారు.
గర్భంతో ఉన్నవారికి మినరల్స్ అత్యవసరం. గర్భస్థ సమయంలో వారి శరీరం లోపల, బయట వచ్చే మార్పులకు తట్టుకుని ఆరోగ్యవంతమైన ప్రసవం జరగాలి అంటే మినరల్స్ తప్పనిసరిగా అవసరం. ఆక్సిజన్, పోషకాలను శరీరంలోని అన్ని భాగాలకు అందేలా చేసే ఎర్రరక్తకణాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా మినరల్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
మహిళలు తీసుకునే ఆహారంలో అవసరం మేరకు మాత్రమే కార్బోహైడ్రేట్స్, సులువుగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. గర్భస్థ సమయంలో ఆడవారి జీర్ణక్రియ శక్తి తగ్గిపోతుంది. కావున వారు త్వరగా జీర్ణం కాని ఆహారాన్ని తినడం వల్ల శరీరంలోని విసర్జక పదార్థాలు బయటికి పంపడంలో విఫలం అవడం వల్ల రక్తం చెడిపోయి ఇతరత్రా ఇన్‌ఫెక్షన్స్ కలిగే అవకాశం ఉంది. కాబట్టి త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.
కడుపుతో ఉన్న ఆడవారు ఎక్కువగా పచ్చని ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ తీసుకనే ఆహారంలో ఐదు రకాల రంగులున్న పండ్లను తీసుకోవాలి. అంటే అరటి, బత్తాయి, ఆపిల్, ద్రాక్ష, జామ.. వంటివన్నమాట. ఆకలిగా అనిపించకున్నా కడుపుతో ఉన్నవారు తినడానికి ప్రయత్నించాలి. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే అరటిపండ్లను ప్రతిరోజూ తప్పకుండా తినాలి. కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, పాల పదార్థాలను తినడానికి ప్రయత్నించాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతిరోజూ ఒక గ్లాసు అన్ని పండ్లు కలిపిన పండ్లరసాన్ని తీసుకోవాలి.