ఐడియా

కొనగోటి అందానికై..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీనేజీ అమ్మాయిలు గోళ్ల అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. నెయిల్ పాలిష్‌ని ఉపయోగించడంలో మెలకువలు తెలుసుకోగలిగితే మరింత చక్కగా వాటిని ఉపయోగించుకోవచ్చు. అదెలాగంటే..
* కొందరు గోళ్లరంగు వేసుకుంటే అది చర్మంపైన కూడా అంటుకుంటుంది. అలాంటప్పుడు వాడేసిన లిప్‌బ్రష్‌ను నెయిల్ పాలిష్ రిమూవర్‌లో ముంచి రంగుపై అద్దితే సరిపోతుంది.
* పార్టీలకు వెళ్లేముందు గోళ్ల రంగు వేసుకుంటూ ఉంటారు. అది త్వరగా ఆరాలంటే చేతివేళ్లను రెండు నిముషాలుపాటు ఐస్‌నీళ్లలో ఉంచి తీస్తే చాలు.
* గోళ్ల రంగు ఎక్కువ రోజులు ఉండాలని చాలామంది కోరుకుంటారు. అలాంటివారు నెయిల్‌పాలిష్ వేశాక పైన పారదర్శకంగా కనిపించే బేస్‌కోట్‌ను వేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది.
* గోళ్ల రంగు సీసాను ఎలా పడితే అలా ఊపకూడదు. రెండు చేతుల మధ్యలో ఉంచుకుని గుండ్రంగా తిప్పితే చాలు. అప్పుడే ఆ సీసాలో బుడగలు రాకుండా ఉంటాయి. గాలి కూడా లోపలికి చేరదు.
* గ్లిట్టర్ నెయిల్ పాలిష్‌ను ఎంచుకున్నప్పుడు దాన్ని ఓ పట్టాన తొలగించలేం. అప్పుడు నెయిల్ పాలిష్ రిమూవర్‌లో ముంచిన దూదిని ఉండలుగా చేసి గోళ్లపై ఉంచాలి. కొన్ని నిముషాల తరువాత గట్టిగా అదిమి తుడవాలి. అలా చేయడం వల్ల రంగు సులువుగా తొలగిపోతుంది.
* నెయిల్ పాలిష్ వేసేముందు గోళ్లను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వీలైతే ఓసారి గోళ్ల చుట్టూ ఉండే క్యూటికల్స్‌ను శుభ్రం చేసుకుంటే మంచిది.
* గోళ్లరంగు వేసుకున్న తరువాత ఎప్పుడూ గోర్లను షేప్ చేసుకోకూడదు. నెయిల్ పాలిష్‌ను రిమూవ్ చేసుకొని గోర్లను శుభ్రం చేసుకుని, షేప్ చేసుకుని తరువాత నెయిల్ పాలిష్ వేసుకుంటే మంచిది.