ఐడియా

కళ్ల ఆరోగ్యానికి చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల కళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
ద బేబీ ఆయిల్‌ని కళ్ల చుట్టూ సున్నితంగా మసాజ్ చేస్తే ఒత్తిడి తగ్గి రిలీఫ్ లభిస్తుంది.
ద కీరాని ముక్కలుగా కోసం రుబ్బి రసం తీయాలి. దాంట్లో కొద్దిగా రోజ్‌వాటర్‌ని కలిపి కళ్ల చుట్టూ పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోవాలి.
ద గంధం పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఇందులో కొద్దిగా జాజికాయ పొడిని కలిపి రాత్రి పడుకునే ముందు కళ్ల చుట్టూ పట్టించాలి. తెల్లవారి కడిగేసుకుంటే కంటికి చలువే కాకుండా నల్లని వలయాలు కూడా తగ్గిపోతాయి.
ద బంగాళాదుంపని మెత్తగా రుబ్బి రసం తీయాలి. అందులో దూదిని ముంచి కనురెప్పలపై పదిహేను, ఇరవై నిముషాల పాటు ఉంచి కడిగేయాలి.
ద కొబ్బరి నూనె చుక్కల్ని కళ్ల చుట్టూ వలయాకారంలో రాసి నెమ్మదిగా మసాజ్ చేస్తే కళ్ల కింద నలుపు తగ్గుముఖం పడుతుంది.
ద కనురెప్పలు దట్టంగా పెరగాలంటే క్రమం తప్పకుండా ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కనురెప్పలకి ఆముదం రాయాలి.
ద కాచి వడబోసిన నీటిలో చిటికెడు ఉప్పు వేసి కళ్లను కడిగితే కళ్లు కాంతివంతంగా కనిపిస్తాయి.
ద టొమాటో రసాన్ని, నిమ్మరసాన్ని సమపాళ్లలో కలిపి కళ్లచుట్టూ పూయాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే కళ్ల కింద నలుపు తగ్గడమే కాకుండా ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ఈ మిశ్రమం రోజు విడిచి రోజు పూస్తే మంచి ఫలితం ఉంటుంది.
ద కీరాను చక్రాల్లా కోసం ఐదు నిముషాలు కళ్లమీద ఉంచినా కళ్లు తాజాగా ఉంటాయి.
ద ఒక గ్లాసు నీళ్లలో ఒక చెంచా ఉసిరికపొడిని వేసి అరగంటపాటు ఉంచాలి. ఈ తేటతో కళ్లను శుభ్రం చేసుకుంటే కళ్లు తాజాగా ఉంటాయి.